నిద్ర మనిషికి చాలా అవసరం. నిద్ర పోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజితం అవుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మనిషికి నిద్ర కరువైపోతోంది. మంచి గాఢమైన నిద్ర దొరకడం అరుదైపోతోంది. ఈక్రమంలో మనిషి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అసలు నిద్రకు శరీర ఆరోగ్యానికి లింకేంటి? అసలు నిద్ర ఎలా పోవాలి? ఎన్ని గంటలు పడుకోవాలి? నాణ్యమైన నిద్ర అంటే ఏమిటి? నిపుణులు చెబుతున్న వివరాలను తెలుసుకుందాం..
నిజానికి, ఒక వ్యక్తి రాత్రిపూట 10 గంటలపాటు మంచం మీద ఉన్నంత మాత్రాన అతను నాణ్యమైన నిద్రను పొందుతున్నాడు అని అనుకోలేమని నిపుణులు చెబుతున్నారు. ప్రశాంతమైన నిద్రను కలిగి ఉన్నా.. అది నాణ్యమైన నిద్ర కాదని వివరిస్తున్నారు. మరి నాణ్యమైన నిద్ర అంటే ఏమిటి? దానికి కొన్ని కొలతలు ఉన్నాయట.. అవేంటో చూద్దాం..
మీరు తగినంతగా నిద్రపోకపోతే, ఏకాగ్రత కోల్పోవడం, భావోద్వేగానికి లోనవడం జరుగుతుంది. మరింత చికాకు, ఒత్తిడి, కోపం, విచారం, మానసిక అలసట ఉండే అవకాశం ఉంది. నాణ్యమైన నిద్ర లేకపోతే దీర్ఘకాలంలో గ్రోత్ హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అది శరీరం రీసెట్ యొక్క విధులను ప్రభావితం చేస్తుంది. ఒక వారం లేదా రెండు వారాల పాటు నిద్ర లేకపోతే అది రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతుంది. రోజులో కనీసం 7 గంటల కంటే తక్కువ నిద్ర ఉన్నవారికి జలుబు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాకుండా ఏవైనా టీకాలు వేసినప్పుడు అవి సక్రమంగా పనిచేయాలంటే నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా మీరు హెపటైటిస్ బి లేదా ఇన్ఫ్లుఎంజా వ్యాక్సినేషన్ చేయించుకొని సక్రమంగా నిద్రపోక పోతే దాని ప్రభావం అంతక ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది అలా కొనసాగితే దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, స్థూలకాయం, క్యాన్సర్, మానసిక జబ్బులు చుట్టుముట్టే అవకాశం చాలా ఎక్కువ.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..