Health Tips: ‘100 రోజుల దగ్గు’ అంటే ఏమిటి? అశ్రద్ధ చూపితే ప్రాణాలకు ప్రమాదమా..

100రోజుల దగ్గు అనేది కోరింత దగ్గుకు మరొక పేరు. దీనిని వైద్యపరంగా పెర్టుసిస్ అని కూడా పిలుస్తారు. సాధారణ పరిభాషలో 100 రోజుల దగ్గు అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుంది. సాధారణ జలుబు వలె ప్రారంభమవుతుంది. కోరింత దగ్గు లేదా పెర్టుసిస్ అనేది బాక్టీరియం బోర్డెటెల్లా పెర్టుసిస్ వల్ల వచ్చే అంటువ్యాధి. శ్వాసకోశాల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది.

Health Tips: 100 రోజుల దగ్గు అంటే ఏమిటి? అశ్రద్ధ చూపితే ప్రాణాలకు ప్రమాదమా..
100 Days Cough

Edited By: Ram Naramaneni

Updated on: Mar 07, 2024 | 7:49 PM

100రోజుల దగ్గు అనేది కోరింత దగ్గుకు మరొక పేరు. దీనిని వైద్యపరంగా పెర్టుసిస్ అని కూడా పిలుస్తారు. సాధారణ పరిభాషలో 100 రోజుల దగ్గు అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుంది. సాధారణ జలుబు వలె ప్రారంభమవుతుంది. కోరింత దగ్గు లేదా పెర్టుసిస్ అనేది బాక్టీరియం బోర్డెటెల్లా పెర్టుసిస్ వల్ల వచ్చే అంటువ్యాధి. శ్వాసకోశాల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. ఎక్కువగా ఊపిరిపీల్చుకున్నప్పుడు గొంతు నుంచి హుహ్.. అనే ఒకరకమైన శబ్ధం వస్తుంది. చిన్నపిల్లల్లో ఈ వ్యాధి సోకినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకుంటే వారి శ్వాసకోశాల మీద తీవ్రప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. దీనికి టీకా అనేది ఒక ప్రాథమిక నివారణ చర్య దీంతో పాటు చికిత్సలో సాధారణంగా యాంటీబయాటిక్స్ ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా ఇది సంక్రమించవచ్చు.

2024లో ఇప్పటి వరకు ఇంగ్లండ్ లో 600కి పైగా కోరింత దగ్గు కేసులు నమోదైనట్లు డైలీ మెయిల్ అనే సర్వే నివేదించింది. ఈ ఇన్ఫెక్షన్ కి గురైన వారికి ఉంటే లక్షణాలు ముక్కు కారటం, గొంతు నొప్పి ఉంటుంది. ఈవ్యాధి తీవ్రత నవజాత శిశువులలో 3% మరణాల రేటును కలిగి ఉంది. ఈ కోరింత దగ్గుతో ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న చాలా మంది పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనిని సైంటిఫిక్ భాషలో న్యుమోనియా సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతారు. పిల్లల్లో వీటి లక్షణాలు ఇలా ఉంటాయి. ముక్కు కారడం, తుమ్ములు, తేలికపాటి దగ్గు ఉంటుంది. ఇన్ఫెక్షన్ ముదిరే కొద్దీ తీవ్రమైన దగ్గు ఏర్పడుతుంది. వాంతులు, అలసటకూడా కలుగవచ్చు. శిశువులు, చిన్న పిల్లలకు ఇచ్చే డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్ టీకాలు రక్షణను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది.

గర్భిణీలు తమ గర్భధారణ సమయంలో ఈ టీకాను స్వీకరించాలని కూడా సలహా ఇస్తారు వైద్యులు. తద్వారా నవజాత శిశువులకు రక్షిత ప్రతిరోధకాలను పనిచేస్తుంది. భారతదేశంలో కోరింత దగ్గు కోసం DTP టీకా ఇవ్వబడుతుంది. D’ అంటే డిఫ్తీరియా, ‘T’ అంటే టెటానస్, ‘P’ అంటే పెర్టుసిస్ అని అర్థం. 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి DTP వ్యాక్సిన్ ఇవ్వబడదు. ఎందుకంటే పెర్టుసిస్ టీకా 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే ఇస్తారు. పెద్ద పిల్లలకు టెటానస్, డిఫ్తీరియా ఇవ్వడం వల్ల వ్యాధి ధరిచేరదు. అందుకే 11-12 సంవత్సరాల వయస్సులో ప్రతిఒక్కరూ DT టీకాను బూస్టర్ డోస్‎గా తీసుకోవాలని చెబుతారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..