
ఉదయం నిద్ర లేవగానే మీ ముఖం మీద అదనపు నూనె కనిపిస్తే చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోండి. అది అదనపు నూనెను తొలగిస్తుంది. మీ ముఖం మెరుస్తుంది. చల్లటి నీరు ముఖం నుండి ముడతలను తొలగిస్తుంది. ఐస్ వాటర్‌తో ముఖాన్ని కడుక్కుంటే ఇన్‌స్టంట్ గ్లోని పొందడానికి వీలవుతుంది. ఐస్ వాటర్ వల్ల చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడి గ్లో ఎక్కువవుతుంది. ముఖంపై జిడ్డు తగ్గుతుంది. చర్మం నుంచి ఎక్స్‌ట్రా నూనె రిలీజ్ అవకుండా ఉంటుంది. కొంతమందికి నిద్రలేచిన తర్వాత ముఖం ఉబ్బినట్లుగా ఉంటుంది. ఇలాంటి వారు ఐస్ వాటర్‌తో ముఖాన్ని వాష్ చేసుకుంటే ఈ సమస్య వెంటనే తగ్గిపోతుంది.
మేకప్ వేసుకోవడానికి ముందు ఐస్ వాటర్‌తో ముఖాన్ని కడిగితే మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. అలాగే నేచురల్ గ్లో కనబడుతుంది. ఐస్ వాటర్‌తో ముఖాన్ని కడుక్కుంటే చల్లదనం వల్ల చర్మానికి శాంతిని ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో హాయిగా అనిపిస్తుంది. ఐస్ వాటర్‌తో ముఖాన్ని కడుక్కుంటే మొటిమలు కూడా తగ్గిపోతాయి. మొటిమల దగ్గర ఇరిటేషన్, మంట కూడా తగ్గుతాయి.
చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుంటే చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో చర్మంపై ముడతలు రాకుండా చూసుకోవచ్చు. తద్వారా ఎల్లపుడూ యవ్వనంగా ఉంటారు. ఐస్ వాటర్‌తో ముఖాన్ని కడుక్కుంటే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ముఖం అందంగా మారుతుంది. ఐస్ వాటర్‌తో ముఖాన్ని కడుక్కుంటే స్కిన్ టోన్ బాగుంటుంది. ముఖంపై ట్యాన్ తగ్గి అందంగా, యవ్వనంగా కనిపించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..