
అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే అరటిపండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తినడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలు చూపుతాయి. ముఖ్యంగా అరటి పండ్లలో విటమిన్ సి, ప్రోటీన్, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక అరటి పండు తినడం వల్ల శరీరానికి పలు ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి, రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
రక్తపోటును నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం ప్రారంభించాలి. అరటిపండులోని వివిధ పోషకాలు తీవ్రమైన, ప్రాణాంతకమైన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పండును తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
అరటిపండ్లు ఎముకలను బలపరచడంలో కూడా సహాయపడతాయి. ఎముకలను ఎక్కువ కాలం బలంగా ఉంచుకోవాలంటే రోజుకు ఒక అరటిపండు తినడం ప్రారంభించాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే అరటిపండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి అరటిపండ్లు మేలు చేస్తాయి.
అరటిపండ్లు పేగుల ఆరోగ్యంపై కూడి సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అలాగే అరటిపండ్లు తినడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
అరటిపండ్లలో సమృద్ధిగా ఉండే పీచుపదార్థం ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను కాపాడుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించి, కడుపు సంబంధిత ఇతర సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అరటిపండ్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
అరటిపండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ పోషకాలు న్యూరోట్రాన్స్మిటర్ కమ్యూనికేషన్‌ను పెంచుతాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అరటిపండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ పోషకాలు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.