
భోజనం చేసిన తర్వాత చాలామంది నిద్రపోతుంటారు..కానీ, ఇది మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. భోజనం తర్వాత నడక బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే నడవడం వల్ల క్యాలరీలు తగ్గిపోతాయి. ఇలా చేయడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు.
భోజనం తర్వాత 10నిమిషాలు వాకింగ్ చేయటం వల్ల రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది గుండెను బలపర్చడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది పోషకాలు అందుతాయి. తిన్న తర్వాత నడవడం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ కూడా హఠాత్తుగా పెరగకుండా ఉంటుంది.
తిన్న తరువాత వాకింగ్ చేయటం వల్ల ఆహారం కూడా తేలిగ్గా జీర్ణం అయిపోతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. తద్వారా మీ గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇలాంటి సాధారణ వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. తిన్న తర్వాత నడవటం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. కండరాలు, కీళ్లను బలపర్చడంలో చాలా బాగా సహయపడుతుందని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..