Health Tips: ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు తాగుతున్నారా..? రెండు వారాల్లో మీ శరీరంలో జరిగేది ఇదే..

ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉపయోగించే మసాలా దినుసుల్లో మెంతులు కూడా అతి ముఖ్యమైనవి. మెంతుల్ని స్పెషల్ వంటకాల్లో తప్పనిసరిగా వాడుతుంటారు. ఇవి వంటల రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. అందుకే ఇటీవలి కాలంలో మెంతులు, మెంతినీళ్లను తాగే అలవాటు ప్రజల్లో ఎక్కువగా పెరిగింది. చాలా మంది ఉదయాన్నే మెంతినీళ్లు తాగటం అలవాటు చేసుకుంటున్నారు. కానీ, ఇలా ప్రతి రోజూ ఉదయాన్నే మెంతినీళ్లు తాగటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

Health Tips: ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు తాగుతున్నారా..? రెండు వారాల్లో మీ శరీరంలో జరిగేది ఇదే..
Fenugreek Water

Updated on: Aug 25, 2025 | 8:06 PM

మంచి ఆరోగ్యానికి మెంతులు చేసే అంతా ఇంతా కాదు…మెంతుల్లోని ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్-డి, విటమిన్- సి వంటి పోషకాలు మనకు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. మెంతుల్లోని కొన్ని సమ్మేళనాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర నియంత్రణ సహజంగానే సాధ్యమవుతుంది. అంతేకాకుండా, దీనిలోని కరిగే ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించవచ్చు. అయితే అయితే వరుసగా రెండు వారాల పాటు మెంతులు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు నియంత్రణ: మెంతి నీరు జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. అందువలన ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఈ నీరు మలబద్ధకం, కడుపు నొప్పి, ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మెరిసే చర్మం: మెంతి నీరు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మపు రంగును మెరుగుపరుస్తాయి. మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. ఇది సహజమైన మెరుపును ఇస్తుంది. అంతేకాకుండా, ఇది చుండ్రును తగ్గిస్తుంది. తలలోని చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మెంతి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, మెంతి నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..