తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? ఆ సమస్యలన్నీ ఔట్..

తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తమలపాకు నీరు తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు నీరు జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తమలపాకులతో తయారుచేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి

తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? ఆ సమస్యలన్నీ ఔట్..
తమలపాకులు మన జీర్ణక్రియను మెరుగపరుస్తాయి. జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి.. వాటిని నమలడం వల్ల లాలాజల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Updated on: Feb 28, 2025 | 10:07 PM

ఆయుర్వేదంలో తమలపాకు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. తమలపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ ఆకుల్లో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తమలపాకులను నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, తమలపాకులను నీళ్లలో వేసి మరిగించి తీసుకోవడం వలన మన శరీరానికి మరింత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తమలపాకు నీరు తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు నీరు జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తమలపాకులతో తయారుచేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించబడుతుంది, ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరం.

తమలపాకు నీరు శరీరాన్ని విషరహితం చేస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది, దాని శోథ నిరోధక లక్షణాలు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. తమలపాకును వేడి నీటిలో మరిగించి తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. తమలపాకులు నోటి నుండి దుర్వాసనను తొలగించడంలో సహాయపడతాయి, దంతాలను మెరిసేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..