వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషకరమైన, ముఖ్యమైన క్షణం. వధూవరులు, వారి కుటుంబ సభ్యులు పెళ్లి కోసం ఎంతో ఉత్సాహం, హడావుడి ప్రదర్శిస్తుంటారు. వివాహం చేసుకునేటప్పుడు, కుటుంబ స్థితి, ఆదాయం, ఇద్దరి అందం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వరుడు, వధువు జాతకాలు ఒకదానికొకటి సరిపోతాయో లేదో చూస్తారు. ఇదంతా నిన్నమొన్నటి వరకు, అయితే, ప్రస్తుతం ఈ లెక్క మారింది.. ఈరోజుల్లో జాతకంతో పాటు బ్లడ్ గ్రూప్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వధూవరులిద్దరూ ఒకే బ్లడ్ గ్రూప్‌లో ఉంటే సమస్యలు వస్తాయని తరచూ చెబుతుంటారు. కానీ, ఇది చాలా మందికి తెలియని అవగాహన లోపం అంటున్నారు నిపుణులు.
తల్లి బ్లడ్ గ్రూప్ నెగిటివ్, తండ్రి బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే, ఇలాంటి కారణాలతో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకోవడం అన్యాయం. ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కూడా పెళ్లి చేసుకోవచ్చునని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. పెళ్లయిన జంట బ్లడ్ గ్రూప్ ఒకేలా ఉండకూడదని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం లేదు. కాబట్టి బ్లడ్ గ్రూప్ ఏదయినా సరే, పెళ్లి చేసుకునే ముందు జంటలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.
అంతేగానీ, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు. భార్యాభర్తలది ఒకే బ్లడ్ గ్రూప్ ఉండటం వల్ల వారికి పుట్టబోయే పిల్లలకు ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. లేదంటే, మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి