
స్ట్రాబెర్రీలు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయో, తినడానికి కూడా అంతే రుచికరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజూ స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వ్యాధుల నుండి రక్షిస్తుంది. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు ఉన్న వృద్ధులకు స్ట్రాబెర్రీలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. స్ట్రాబెర్రీలలో పొటాషియం అధికంగా ఉంటుందని, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
స్ట్రాబెరీ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగనివ్వకుండా చేస్తాయి. అంతేకాదు, ఇది గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. తద్వారా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. రోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకానికి చికిత్స చేస్తుంది .
స్ట్రాబెరీలో విటమిన్ సి ఉంటుంది. ఇది సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. స్ట్రాబెరీలో ఉండే విటమిన్ సి, ఎలెజిక్ యాసిడ్ కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో మీ చర్మం సన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండే ఈ పండు వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల ముడతలు అదుపులో ఉండి, యవ్వన చర్మాన్ని ఎక్కువ కాలం కాపాడుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..