ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..! లాభాలు తెలిస్తే..

|

Dec 21, 2024 | 9:57 AM

బొప్పాయి లాభాలు దాదాపు అందరికీ తెలిసిందే. బొప్పాయి, పండు కాయతో పాటుగా బొప్పాయి ఆకులు కూడా అద్భుతమై ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకులతో జ్యూస్‌ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు. ఈ జ్యూస్‌ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. బొప్పాయి ఆకుల రసంతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..! లాభాలు తెలిస్తే..
Papaya Leaves
Follow us on

బొప్పాయి ఆకుల ర‌సంలో విట‌మిన్లు ఎ, ఇ, సి, కె, బి లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. ఆకలి తక్కువగా ఉన్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది. బొప్పాయి ఆకుల జ్యూస్‌ తీసుకోవటం వల్ల ఆకలి పెరిగి ఆరోగ్యం ఉంటారు. బొప్పాయి ఆకుల రసం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ బొప్పాయి ఆకు జ్యూస్‌ తీసుకోవడం వల్ల సమస్య త‌గ్గుతుంది.

బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. బొప్పాయి ఆకుల్లో ఫెనొలిక్ అనే కాంపౌండ్, పపాయిన్, అల్కనాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లలా పని చేసి… శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకోవటం వల్ల పొట్టలో గ్యాస్, అల్సర్, నొప్పి వంటివి దూరం చేస్తుంది. మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని సరిచెయ్యడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది.

చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద, జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జుట్టు మెరుస్తుంది కూడా… షాంపూ కండీషనర్‌లా ఇది పనిచేస్తుంది. జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)