Weight Loss Tips: పసుపును ఇలా వాడితే పొట్ట కొవ్వు మాయమై సన్నబడటం ఖాయం..!

|

Feb 03, 2024 | 3:31 PM

పసుపుతో పాటు దాల్చిన చెక్క కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీని తయారీ కోసం పాన్‌లో ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో దాల్చిన చెక్క ముక్క, చిటికెడు పసుపు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఇలా తాగటం వల్ల మీ బరువు అదుపులో ఉంటుంది.

Weight Loss Tips: పసుపును ఇలా వాడితే పొట్ట కొవ్వు మాయమై సన్నబడటం ఖాయం..!
Turmeric Tea For Weight Loss
Follow us on

పసుపు.. అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పక ఉపయోగిస్తారు. మనం ప్రతి నిత్యం వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలలో పసుపు కూడా ఒకటి.. అలాగే, ప్రతి శుభకార్యంలోనూ పసుపుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పసుపులో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది. పసుపు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు నుండి మధుమేహం వరకు ప్రతిదీ నియంత్రించడంలో పసుపు ప్రయోజనకరంగా పనిచేస్తుంది. అయితే పసుపు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా? అవును, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. దీని రెగ్యులర్ వినియోగం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి పసుపును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయాన్నే పసుపు నీరు:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో పచ్చి పసుపు ముక్కలను వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గగానే గ్లాసులో వడకట్టి కాస్త నిమ్మకాయ లేదా తేనె కలిపి తాగాలి. దీని రెగ్యులర్ వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పసుపు, అల్లం:

బరువు తగ్గడానికి పసుపు, అల్లం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండింటి కలయిక మీ అదనపు కొవ్వును త్వరగా తగ్గిస్తుంది. దీని కోసం ఒక కప్పు నీటిలో ఒక అంగుళం అల్లం ముక్క, రెండు చిటికెల పసుపు వేసి మరిగించాలి. తర్వాత వడకట్టి టీ లాగా తాగేయాలి.

పసుపు, తేనె:

పసుపు, తేనె మిశ్రమం బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికోసం ఒక గిన్నెలో ఒక చెంచా తేనె తీసుకోండి. దానికి పచ్చి పసుపు వేసి కలిపి తినేయొచ్చు. కావాలంటే పసుపు నీళ్లలో తేనె కలిపి కూడా తాగవచ్చు.

పసుపు పాలు:

మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు పసుపు పాలు కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాసు వేడి పాలలో ఒక చెంచా పసుపు వేసి బాగా కలపాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దీన్ని తాగండి. క్రమం తప్పకుండా ఇలా చేయటం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అదనంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిద్ర కూడా మెరుగుపడుతుంది.

పసుపు, దాల్చినచెక్క:

పసుపుతో పాటు దాల్చిన చెక్క కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీని తయారీ కోసం పాన్‌లో ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో దాల్చిన చెక్క ముక్క, చిటికెడు పసుపు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఇలా తాగటం వల్ల మీ బరువు అదుపులో ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..