Slim After 40’s: నలభై ఏళ్ల వయస్సు దాటినా ఇరవైల్లా కనబడడం ఇంత సులువా? ఈ టిప్స్ ఫాలోొ అయితే చాలు

ఈ వయస్సులో జీవక్రియ మందగించడంతో హార్మోన్ల హెచ్చుతగ్గులు వల్ల బొడ్డు దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి బరువు పెరగడం అనేది ఈ వయస్సులో సాధారణ పరిణామం.

Slim After 40’s: నలభై ఏళ్ల వయస్సు దాటినా ఇరవైల్లా కనబడడం ఇంత సులువా? ఈ టిప్స్ ఫాలోొ అయితే చాలు
5 Vegetables To Weight Lose

Edited By: Anil kumar poka

Updated on: Dec 14, 2022 | 1:48 PM

40 ఏళ్ల తర్వాత బరువు మెయిన్ టెయిన్ చేయడం పెద్ద ప్రహసనం. ఈ వయస్సులో జీవక్రియ మందగించడంతో హార్మోన్ల హెచ్చుతగ్గులు వల్ల బొడ్డు దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి బరువు పెరగడం అనేది ఈ వయస్సులో సాధారణ పరిణామం. బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా, సాధారణం కంటే తక్కువ వేగంతో కేలరీలను బర్న్ అవుతాయి. నిపుణులు పరిశీలనలో 40 ఏళ్ల వయస్సు దాటాక కండరాలు బలహీనపడి గాయాల ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడైంది.

40 ఏళ్లు నిండిన తర్వాత స్లిమ్‌గా ఉండడానికి సహాయపడే కొన్ని సాధారణ బరువు తగ్గించే పద్ధతులను తెలుసుకుందాం. 

  1.  ఈ వయస్సులో చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే జీవక్రియ కూడా పెరగుతుందని అప్లైడ్ ఫిజియాలజీలో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. 
  2.  సమయానుగుణంగా పడుకోవడం వల్ల ఈ వయస్సులో బరువు పెరగకుండా ఉండడానికి దోహదం చేస్తుంది. అలాగే కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి
  3.  రాత్రి సమయంలో ఆహారం తీసుకోకుండా ఉంటే ఉండడం వల్ల మేలు చేస్తుంది. కనీసం 12 గంటలు ఏమీ తినకుండా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 
  4.  వారాంతంలో మద్యం తీసుకోవడం వల్ల కూడా బరువును కంట్రోల్ ఉంచుకోవచ్చు. వారానికి 14 యూనిట్లకు మించి మద్యం తీసుకోకూడదు. 
  5.  బాదం పప్పు, చేపలు, వాల్ నట్స్ , నెయ్యి, లాంటి ఆరోగ్యకరైమన కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం కూడా మంచిది. వీటిలో ఉండే విటమిన్ ఏ,డీ,ఈ శరీర శోషణను పెంచుతాయి. 
  6.  శారీరక వ్యాయమం ద్వారా బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అధిక బరువులు ఎత్తడం ద్వారా వేగంగా శరీర కొవ్వును కరిగిస్తుంది. 
  7.  అధికంగా  ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మేలు చేస్తుంది. ప్రొటీన్ ఫుడ్లో మాక్రోన్యూట్రియెంట్లు ఆహార బాధను తీరుస్తుంది. తద్వారా తక్కువ తింటాం. 
  8.  స్నాక్స్ తినే సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతను ఇవ్వాలి,
  9.  5:2ను కచ్చితంగా పాటించాలి. అంటే వాారానికి ఐదు రోజులు ఆరోగ్యకరంగా తింటూ మరో రెండు రోజులు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటే కూడా అధిక బరువు నుంచి గట్టెక్కచ్చు. 
  10. కనీసం వారానికి 150 నిమిషాల పాటు లైట్ ఎక్సరసైజ్ లు చేయాలి. దీంతో పాటు 75 నిమిషాలు కఠినమైన వ్యాయామం చేస్తే మేలు.
  11. ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జిమ్ కు వెళ్లి వ్యాయామం చేయడం మేలు చేస్తుంది. 
  12. బరువు తగ్గేందుకు మన స్నేహితుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ ఓ పార్ట్ నర్ ను చేర్చుకుంటే వారితో పాటు ఉత్సాహంగా బరువు తగ్గేందుకు ఆసక్తి చూపిస్తాం.
  13. రోజంతా ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో? అనే విషయంపై దృష్టి పెట్టాలి. వాటిలో పెరుగు, గింజల ఆహారం, పండ్లు వంటివి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..