Weight Loss Tips: ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లు, కూరగాయలు తిన్నారంటే.. మీ బరువు వేగంగా..

|

Sep 26, 2022 | 3:25 PM

బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. ఈ క్రమంలో పోషకాలు పుష్కలంగా ఉండే ఎరుపు రంగు ఆహారాలను కూడా మీ డైట్‌లో చేర్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

Weight Loss Tips: ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లు, కూరగాయలు తిన్నారంటే.. మీ బరువు వేగంగా..
Weight Loss Diet
Follow us on

Weight Loss Diet: బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. ఈ క్రమంలో పోషకాలు పుష్కలంగా ఉండే ఎరుపు రంగు ఆహారాలను కూడా మీ డైట్‌లో చేర్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా వేగంగా బరువు తగ్గుతారు. ఆరోగ్యంతోపాటు, రుచి కూడా బాగుంటుంది. ఎరుపు రంగులో ఈ పండ్లు, కూరగాయలను వెంటనే మీ డైట్‌లో చేర్చుకోండి. అవేంటంటే..

బీట్‌రూట్

బీట్‌రూట్‌లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. బీట్‌రూట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిల్లోని ఐరన్ శరీరంలో రక్త హీణతను తొలగిస్తుంది. బీట్‌రూట్‌లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల, చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. బీట్‌రూట్‌ను సలాడ్, సూప్, జ్యూస్ ఏ విధంగానైనా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన పండు. వీటిల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. స్ట్రాబెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజూ 2, 3 స్ట్రాబెర్రీలు తింటే ఆరోగ్యతోపాటు బరువు ఆదుపులో ఉంటుంది.

టమాటా

టమాటాలను ఎక్కువగా కూరల్లో ఉపయోగిస్తారు. టమాటలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల చాలా సేపటి వరకు ఆకలి లేకుండా, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. టమాటలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ టమోటా జ్యూస్‌ తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది.

రెడ్‌ క్యాప్సికమ్‌

బరువు తగ్గించే ఆహారంలో రెడ్‌ క్యాప్సికమ్‌ కూడా ఒకటి. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 2, 3 రెడ్‌ క్యాప్సికమ్‌ తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.