బరువు తగ్గాలనుకుంటున్నారా.. రాత్రి సమయంలో పొరపాటున కూడా ఈ 4 పదార్థాలను తినొద్దు

|

May 14, 2024 | 7:20 PM

ప్రారంభంలోనే పెరిగిన బరువును నియంత్రించుకోవడం ఆరోగ్యానికి మేలు. బరువు తగ్గించుకునే సమయంలో వ్యాయామంతో పాటు డైట్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవాలి. రోజువారీ దినచర్యలో చిన్న చిన్న చర్యలతో కూడా బరువును నియంత్రించు కోవచ్చు. ఫిట్‌గా ఉంటారు. ఎవరైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే రాత్రి సమయంలో కొన్ని పదార్థాలు తినడం మానేయాలి. లేకపోతే బరువు తగ్గడానికి బదులు వేగంగా బరువు పెరుగుతారు. కనుక పెరుగుతున్న బరువును నియంత్రించడానికి రాత్రి సమయంలో ఏయే వస్తువులకు దూరంగా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకుంటున్నారా.. రాత్రి సమయంలో పొరపాటున కూడా ఈ 4 పదార్థాలను తినొద్దు
Weight Loss Tips
Follow us on

ఆధునిక జీవనశైలిలో ఆహారం తినే సమయంలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ వంటి అనేక కారణాలు ఉన్నాయి. దీని కారణంగా ఊబకాయం సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. పెరుగుతున్న బరువును సకాలంలో అదుపు చేసుకోక పొతే అది ఊబకాయంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. దీని కారణంగా శరీరం తీరు చెడుగా కనిపించడమే కాదు.. రకరకాల వ్యాధులు కూడా శరీరంలోకి ప్రవేశించడం ప్రారంభిస్తాయి. కనుక ప్రారంభంలోనే పెరిగిన బరువును నియంత్రించుకోవడం ఆరోగ్యానికి మేలు. బరువు తగ్గించుకునే సమయంలో వ్యాయామంతో పాటు డైట్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవాలి.

రోజువారీ దినచర్యలో చిన్న చిన్న చర్యలతో కూడా బరువును నియంత్రించు కోవచ్చు. ఫిట్‌గా ఉంటారు. ఎవరైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే రాత్రి సమయంలో కొన్ని పదార్థాలు తినడం మానేయాలి. లేకపోతే బరువు తగ్గడానికి బదులు వేగంగా బరువు పెరుగుతారు. కనుక పెరుగుతున్న బరువును నియంత్రించడానికి రాత్రి సమయంలో ఏయే వస్తువులకు దూరంగా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం.

పొరపాటున కూడా వేయించిన ఆహారాన్ని తినవద్దు

డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లేదా ఎక్సెస్ ఆయిల్ వాడిన ఆహారాన్ని రాత్రి సమయంలో తినవద్దు. వాస్తవానికి ఎవరైనా సరే పగటి సమయంలో ఈ ఆహారాన్ని తింటే.. అందుకు తగిన విధంగా శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన శరీరంలోని కేలరీలు కరిగిపోతాయి. అయితే రాత్రి ఇటువంటి ఆహారం తిన్న తర్వాత.. త్వరగా నిద్రపోతారు. అటువంటి పరిస్థితిలో వేయించిన లేదా ఆయిల్ ఫుడ్స్ తింటే అప్పుడు కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. ఊబకాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఎక్కువ నూనెతో కూడిన ఆహారానికి దూరంగా ఉండడం మేలు.

ఇవి కూడా చదవండి

రెడ్ మీట్ తిన వద్దు

రాత్రి తినే ఆహారంలో రెడ్ మీట్ కు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో కొవ్వు ఉంటుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు. రెడ్ మీట్‌లో కూడా చాలా ప్రొటీన్లు, క్యాలరీలు ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో రాత్రి వేళ నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. రెడ్ మీట్ తినాలనుకున్నా.. నిద్రించడానికి, తినడానికి మధ్య దాదాపు 3 నుండి 4 గంటల గ్యాప్ తీసుకోండి.

చక్కెర ఉన్న వాటిని తినవద్దు

రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. వేసవిలో చాలా మంది రోజూ రాత్రి ఐస్ క్రీమ్ తినడానికి, కూల్ డ్రింక్స్ వంటి చల్లని పానీయాలు త్రాగడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు వల్ల స్థూలకాయం పెరుగుతుంది. ఎందుకంటే వీటన్నింటిలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ప్రిజర్వేటివ్‌లు కూడా ఉంటాయి.

ఫుల్‌ ఫ్యాట్‌ క్రీమ్‌డ్‌ మిల్క్‌ కు దూరంగా ఉండండి

పాలలో అనేక పోషకాలున్నాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారం అంటారు. రాత్రి సమయంలో గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పాలు తాగడం మంచిది. అయితే ఎవరైనా బరువు తగ్గాలని కోరుకుంటే రాత్రి సమయంలో ఫుల్‌ ఫ్యాట్‌ క్రీమ్‌డ్‌ మిల్క్‌ ను తాగవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..