Healthiest Chapatis Lose Weight: బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి, అలాగే బరువు తగ్గించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఎక్కువగా రాత్రి వేళల్లో చపాతీలు తింటుంటారు. అయితే రెగ్యులర్‌గా తినే చపాతీల వల్ల బరువు తగ్గే అవకాశం ఉండదని కొందరిలో అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ఐదు రకాల పిండి పదార్ధాలతో చపాతీలు తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు.
రాగి పిండి:(Ragi Flour): ఆరోగ్యకరమైన, సాంప్రదాయకంగా అందరూ ఇష్టపడే ధాన్యాల్లో ‘రాగి’ ఒకటి. ఐరన్, కాల్షియం, ఫైబర్ లాంటి పోషకాలు ఉండే రాగిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగితో చేసిన రోటిస్ సులభంగా జీర్ణమవుతాయి.
బాదం పిండి:(Almond Flour): బాదం పోషకాహారానికి గొప్ప మూలం. ఒకవేళ మీరు కిటోజెనిక్ డైట్‌ను అనుసరిస్తుంటే, బాదం పిండితో చేసిన రోటిస్ తినడం చాలా ఉత్తమం. బాదంపప్పులో తక్కువ ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, అది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.
బజ్రా పిండి:(Bajra Flour): మీరు గ్లూటెన్ లేని, ఫైబర్ అధికంగా ఉండే చపాతీ కోసం చూస్తున్నట్లయితే, మీ డైట్‌లో బజ్రా రోటిస్ యాడ్ చేయండి. బజ్రా పిండి చపాతీలలో మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
జోవర్ పిండి:(Jowar Flour): సాధారణ గోధుమ చపాతీల కంటే జోవర్ పిండితో చేసిన చపాతీలు ఎంతో ఆరోగ్యకరం. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. జోవర్ జీర్ణక్రియను మరింత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా విటమిన్ సీ ఉంటుంది.
వోట్ పిండి(Oat Flour): బరువు తగ్గించే అద్భుతమైన ఆహార పదార్ధం వోట్స్. ఇందులో బి-విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే కంటెంట్ వోట్స్‌లో పుష్కలంగా ఉంటాయి.
Also Read:
మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?
టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?
సర్కస్ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!