Watch Video: మీరెప్పుడైనా ప్రెజర్ కుక్కర్‌లో టీ తయారు చేశారా? వీడియో ఇదిగో..
Pressure Cooker tea making video: టీ ప్రియులకు టీ కేవలం ఒక పానీయం కాదు.. అదొక ఎమోషనల్. ఘుమఘుమలాడే తేనీటి చుక్కలు గొంతును తడపందే చాలా మందిరి రోజు ప్రారంభంకాదు. అలసట నుంచి బయటపడటానికి ఇదొక దివ్యౌషధం. ఎలాంటి అలసట ఉన్నా, ఏదైనా ఆందోళన లేదా ఒత్తిడి ఉన్నా ఒక కప్పు టీ తాగితే అన్నింటినీ దూరం చేస్తుంది. టీ ఓ రంగురంగుల సంభాషణ...

టీ ప్రియులకు టీ కేవలం ఒక పానీయం కాదు.. అదొక ఎమోషనల్. ఘుమఘుమలాడే తేనీటి చుక్కలు గొంతును తడపందే చాలా మందిరి రోజు ప్రారంభంకాదు. అలసట నుంచి బయటపడటానికి ఇదొక దివ్యౌషధం. ఎలాంటి అలసట ఉన్నా, ఏదైనా ఆందోళన లేదా ఒత్తిడి ఉన్నా ఒక కప్పు టీ తాగితే అన్నింటినీ దూరం చేస్తుంది. టీ ఓ రంగురంగుల సంభాషణ. టీ ఏ సమస్యకైనా పరిష్కారం. అందుకే టీ ప్రియులు రోజులో ఎన్నిసార్లు తాగుతారో లెక్కే ఉండదు. కానీ కొన్నిసార్లు టీ సరిగ్గా తయారు చేయకపోయినా, లేదా టీ పొడి, చక్కెర పరిమాణంలో ఏ మాత్రం తేడా ఉన్నా టీ టెస్ట్ ఖచ్చితంగా మారుతుంది. నిజానికి, టీ తయారు చేసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కానీ అందరికీ ఇంట్లో మంచి టీ తయారు చేసుకుని తాగాలని ఉంటుంది. కానీ ఎప్పుడు చేసినా.. ఏదో ఒక లోపం ఉంటుంది. ఇలా కాకుండా టీ పర్‌ఫెక్ట్‌గా తయారు చేయడానికి.. ఓ టెక్నిక్ ఉంది. అసలు మీరెప్పుడైనా ప్రెజర్ కుక్కర్‌లో టీ తయారు చేయడానికి ప్రయత్నించారా ? ఇప్పుడు చేసి చూడండి. రుచి అదిరిపోతుంది..
సాధారణంగా టీని చిన్న పాత్రలో లేదా టీ మేకర్‌తో వచ్చే ప్రత్యేక పాత్రలో తయారు చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా ప్రెజర్ కుక్కర్‌లో టీ తయారు చేయడానికి ప్రయత్నించారా? ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పేజీ కుకింగ్ షుకింగ్‌లో ఓ చెఫ్ ఒక ప్రత్యేకమైన టీ రెసిపీని పంచుకున్నాడు. ఈ రెసిపీ ప్రత్యేకత ఏమిటంటే ఈ టీని ప్రెజర్ కుక్కర్‌లో తయారు చేస్తారట. ఇలా చేయడం వల్ల దీనికి ప్రత్యేకమైన రుచి వస్తుందని చెబుతున్నాడు. ఈ టీ రెసిపీ పూర్తి ప్రక్రియ ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రెజర్ కుక్కర్‌లో టీ ఎలా తయారు చేయాలంటే..
రెండు కప్పుల టీ తయారు చేయడానికి అర కప్పు నీరు, ఒకటిన్నర కప్పు పాలు, మూడు టేబుల్ స్పూన్లు తురిమిన అల్లం, ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు చక్కెర, టీ ఆకులు.. ఈ పదార్థాలన్నింటినీ ప్రెషర్ కుక్కర్‌లో వేసి, మూత మూసి పెట్టి మీడియం వేడి మీద టీ రెండుసార్లు విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. దీని కంటే ఎక్కువ విజిల్స్ వస్తే మాత్రం టీ కాస్త ఘాటుగా మారుతుంది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. అందువల్ల 2 విజిల్స్‌కే దించేయాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి, 3 నుంచి 4 నిమిషాలు పక్కనపెట్టాలి. ఆ తరువాత నెమ్మదిగా మూత తెరిచి టీని ఒక కప్పులోకి వడకడితే సరిపోతుంది.
View this post on Instagram
ప్రెషర్ కుక్కర్‌లో తయారుచేసిన టీ అన్ని పదార్థాలను పూర్తిగా మరిగించడానికి సహాయపడుతుంది. ఫలితంగా రుచి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ పద్ధతి సమయాన్ని ఆదా చేస్తుంది. టీని త్వరగా తయారు చేస్తుంది. మూసి ఉన్న ప్రెషర్ కుక్కర్ అల్లం, టీ పొడి వాసన టీలో పరిపూర్ణంగా కలిసిపోయేలా చేస్తుంది. అయితే టీ తయారుచేసేటప్పుడు ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. రెండుసార్లు కంటే ఎక్కువ విజిల్ వేయకూడదు. లేకుంటే టీ చాలా ఘాటుగా మారవచ్చు. కుక్కర్ తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తద్వారా ఆవిరి అకస్మాత్తుగా బయటకు వెళ్లే ప్రమాదం ఉండదు. మీరు మసాలా చాయ్ ఇష్టపడితే, మీరు ఏలకులు కూడా జోడించవచ్చు. కానీ సమతుల్యంగా వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లో టీ తయారు చేయడం అనేది ఒక కొత్త, ప్రత్యేకమైన పద్ధతి. ఇది సాంప్రదాయ పద్ధతికి కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ ఇది టీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకునే వారు ఇది ట్రై చేయవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








