Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain health: మెదడు చురుకుదనం తగ్గిందా .. ఆహారంలో ఈ మార్పులు చేస్తే చాలు ..

కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. ముఖ్యంగా ధూమపానం, ఒత్తిడి, నిద్రలేమి వంటివి మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలో మీ మెదడును ఆరోగ్యంగా, నవ యవ్వనంగా ఉంచుకునేందుకు మీరు చేయాల్సిన కొన్ని చిట్కాలను నిపుణులు చెబుతున్నారు.

Brain health: మెదడు చురుకుదనం తగ్గిందా .. ఆహారంలో ఈ  మార్పులు చేస్తే చాలు ..
Brain
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 20, 2023 | 9:59 PM

మెదడు.. శరీరంలో అవయవాలన్నింటిని క్రమపరచడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. మీరు అన్ని పనులు సక్రమంగా చేయగలగాలి అంటే మెదడు నుంచే ఆదేశాలు జారీకావాలి. మీ ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం అంతా మెదడు పనితీరుపైనే ఆధారపడే జరుగుతాయి. అందుకే మెదడు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. చాలా మంది దీని గురించి పట్టించుకోరు. ముఖ్యంగా పెరుగుతున్న వయసుతో పాటు మెదడు చాలా మార్పులకు లోనవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడం.. మనుష్యులను సరిగ్గా గుర్తుపట్టలేకపోవడం, దేనినైనా త్వరగ మర్చిపోవడం వంటివి తరచుగా గమనిస్తుంటాం. అయితే మీరు తీసుకొనే ఆహారం, జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడం వల్ల వయసు పెరిగినా మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరోవైపు కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. ముఖ్యంగా ధూమపానం, ఒత్తిడి, నిద్రలేమి వంటివి మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలో మీ మెదడును ఆరోగ్యంగా, నవ యవ్వనంగా ఉంచుకునేందుకు మీరు పాటించాల్సిన కొన్ని చిట్కాలను నిపుణులు చెబుతున్నారు. అవేంటే ఓ సారి చూద్దాం..

ఎప్పుడూ చురుకుగా ఉండాలి.. రోజూ వ్యాయామం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. పరిశోధన ప్రకారం, శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ వయస్సు పెరుగుతున్నా.. మెదడు మాత్రం ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఇది ఇతర శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులకు తక్కువ గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

చక్కెరతో కూడిన ఆహారాన్ని తగ్గించాలి.. మీరు తినేవి కూడా మీ మెదడుపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. చక్కెరతో కూడిన ఆహారం తీసుకునే వ్యక్తులు మధుమేహం లేకుండా కూడా డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు కూడా అనారోగ్యకరమైన బరువు పెరగడానికి దారితీస్తాయి. అందువల్ల, చక్కెరతో కూడిన ఆహారాలు పానీయాల వినియోగాన్ని వీలైనంత తగ్గించడం మేలు.

ఇవి కూడా చదవండి

ఆకుకూరలను తినాలి.. మీరు తీసుకొనే ఆహారంలో మొక్క ఆధారితంగా ఉండేవి ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. ఈ ఆహారం మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పాత్ర పోషిస్తుంది. మెడిటరేనియన్ ఆహారాన్ని అనుసరించే వారికి డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మీ మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ కారకాలు ఆరోగ్యకరమైన మెదడుతో సహా శరీరంలోని అనేక ప్రక్రియలకు కారణమవుతాయి.

పొగాకు, మద్యం ఆపేయాలి.. ధూమపానం చేసే వ్యక్తుల మెదడు వేగంగా పనిచేయదు. పొగాకు వాడకం వల్ల డిమెన్షియా, మెదడు పరిమాణం కోల్పోవడం, స్ట్రోక్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం మెదడుపై కూడా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.

మెదడుకు వ్యాయామం.. మీరు మీ మెదడుకు శిక్షణ ఇవ్వవచ్చు! అదేలా అంటే.. పజిల్స్ పరిష్కరించడం, పదజాలం నిర్మించడం, కార్డ్‌లు ఆడటం, ఇతర మెదడు సంబంధిత గేమ్‌లు వంటి కార్యకలాపాలు మీ మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..