Super Foods: మీ ఆయుష్షును పెంచుకోవాలి అనుకుంటున్నారా.. మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే!

ఆరోగ్యంగా జీవితాంతం ఉండాలంటే.. కొన్ని కొన్ని మార్పులను ఖచ్చితంగా చేసుకోవాలి. సుదీర్ఘ జీవితాన్ని గడపాలంటే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు మీ జీవిత కాలాన్నే పెంచుతాయని మీకు తెలుసా? మీ లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకుని.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. ఎంత ఏజ్‌ వచ్చినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. కొంత మంది ఓల్డ్ పర్సన్స్‌ని గమనిస్తే..

Super Foods: మీ ఆయుష్షును పెంచుకోవాలి అనుకుంటున్నారా.. మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే!
Super Foods

Updated on: Jun 21, 2024 | 2:27 PM

ఆరోగ్యంగా జీవితాంతం ఉండాలంటే.. కొన్ని కొన్ని మార్పులను ఖచ్చితంగా చేసుకోవాలి. సుదీర్ఘ జీవితాన్ని గడపాలంటే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు మీ జీవిత కాలాన్నే పెంచుతాయని మీకు తెలుసా? మీ లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకుని.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. ఎంత ఏజ్‌ వచ్చినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. కొంత మంది ఓల్డ్ పర్సన్స్‌ని గమనిస్తే.. వారు ఎంతో చలాకీగా వారి పనులు వారే చేసుకుంటూ ఉంటారు. ఇందుకు ముఖ్య కారణం వారు తీసుకున్న ఆహారమే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీ ఆయుష్షును పెంచుకుని ఆరోగ్యంగా జీవించాలి అంటే కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. వీటి వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బల పడుతుంది. జీవ క్రియ సవ్యంగా ఉంటుంది. వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. ఇలాంటి సూపర్ ఫుడ్స్ మీ కోసం తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకు కూరలు:

చాలా మందికి ఆకు కూరలు అంటే నచ్చవు. కానీ ఆకు కూరల్లో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఇవి గుండెకు, కంటికి, మూత్ర పిండాలు, కాలేయంకు, శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచతాయి. కాబట్టి ప్రతి రోజూ ఏదో ఒక ఆకు కూర తీసుకోండి.

నట్స్:

మీ ఆయుష్షును పెంచుకోవడంలో నట్స్ కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటివి ప్రతి రోజూ తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో గుడ్ ఫ్యాట్స్‌తో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్లు అందుతాయి. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

పెరుగు:

పెరుగు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది పెరుగు అనేది తినరు. కానీ ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగు పడి.. మీ జీవిత కాలం కూడా పెరుగుతుంది. ఇవి పొట్ట ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని బల పరుస్తుంది. పెరుగులో చక్కెర, ఉప్పు వంటివి కలపకుండా తింటేనే మంచిది.

తృణ ధాన్యాలు:

బార్లీ, ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. వీటిల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూస్తాయి. కొవ్వు చేపలు కూడా ఆరోగ్యానికి మంచిదే.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..