Uric Acid Problem: కేవలం రూ.20తో యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.. ఎలాగో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతో రకరకాల సమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా మారి వేళ్ల కీళ్లలో ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. అంతేకాకుండా దీని వల్ల అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగించడానికి కొన్ని ఆహార అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు.

Uric Acid Problem: కేవలం రూ.20తో యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.. ఎలాగో తెలుసా?
Uric Acid Problem

Updated on: May 17, 2024 | 12:39 PM

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతో రకరకాల సమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా మారి వేళ్ల కీళ్లలో ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. అంతేకాకుండా దీని వల్ల అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగించడానికి కొన్ని ఆహార అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. యూరిక్ యాసిడ్‌ను తగ్గించగల 5 ప్రభావవంతమైన హోమ్‌ రెమెడీస్‌ ఇవే..

  • ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేటరీని నివారించడమే కాకుండా, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం ఒక ఉసిరికాయను తినడం అలవాటు చేసుకోవాలి.
  • ఎండిన కొత్తిమీర ఆకులు శరీరం నుంచి యూరిక్ యాసిడ్ స్ఫటికాలను తొలగించడంలో సహాయపడతాయి. కొత్తిమీర ఆకుల్లో యూరిక్ యాసిడ్ ను మూత్రంతో తొలగించే గుణాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిన వ్యక్తులు కొత్తిమీర టీ లేదా కొత్తిమీర నీటిని తీసుకుంటే మంచిది.
  • యూరిక్ యాసిడ్ స్ఫటికాలను తొలగించడంలో వేప ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది వాపును తగ్గిస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ సమస్యను నయం చేస్తుంది. వేప శరీరం మొత్తం నిర్విషీకరణలో కూడా బాగా పనిచేస్తుంది.
  • రోజువారీ ఆహారంలో చేపలు తినడం వల్ల యూరిక్‌ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. దీని కారణంగా టాక్సిన్స్ తొలగిపోతాయి. ఫలితంగా యూరిక్ యాసిడ్ శరీరం నుంచి సులభంగా బయటికి పోతుంది.
  • ఆయుర్వేదంలో కరక్కాయ (మైరోబాలన్)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో నిర్విషీకరణ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్, యూరిక్ యాసిడ్‌లను సులువుగా బయటకు పంపుతుంది. మైరోబాలన్ తీసుకోవడం జీర్ణక్రియకు కూడా మంచిది. దీని సహాయంతో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. అలాగే గట్ సమస్యలు కూడా నయమవుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.