AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unknown Facts: ఓర్పుకు నిదర్శనం ఈ జంతువు.. దీని జీవిత రహస్యం మీకు తెలుసా..?

మన జీవితం సహనంతో ఒక పద్ధతి ప్రకారం సాగాలంటే కొన్ని జంతువుల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. గాడిద ను మనం చిన్న చూపు చూసినా .. దాని జీవించే విధానం, దాని ప్రవర్తన మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.

Unknown Facts: ఓర్పుకు నిదర్శనం ఈ జంతువు.. దీని జీవిత రహస్యం మీకు తెలుసా..?
Donkey Facts
Prashanthi V
|

Updated on: May 19, 2025 | 7:45 PM

Share

గాడిద అనే మాటను కొందరు ఎగతాళి చేయడానికి వాడుతుంటారు. గాడిదకు కర్పూరం వాసన తెలుసా..? లాంటి సామెతలు అందుకే పుట్టాయి. కానీ నిజానికి ఇవన్నీ గాడిద నిజమైన స్వభావానికి చాలా దూరంగా ఉంటాయి. మనం గాడిదను ఎంత తక్కువగా మాట్లాడినా.. దాని గొప్ప లక్షణాల గురించి మనకు చాలా తక్కువ తెలుసు.

గాడిదలు కష్టపడే జంతువులు. ఇవి తెలివిగలవిగా కూడా ఉంటాయి. వాటికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. అవి తమ దారిలో అడ్డంకులు గుర్తించగలవు. అవసరమైతే మార్గాన్ని మార్చుకుని సమస్యను పరిష్కరించగలవు. ఇవి ప్రయాణంలో సమస్యలపై స్వతహాగా పరిష్కారం కనుగొనగలవు.

గాడిదలు మానవ అభివృద్ధికి తోడుగా పనిచేసే జంతువులలో ఒకటి. ఇవి బలమైన కాళ్లతో భారాన్ని మోయగలవు. ఇవి చిన్నగా కనిపించినా చాలా బలం ఉంటుంది. గాడిదలు ఎక్కువ తినకపోయినా.. ఎక్కువ పని చేస్తాయి. వీటిపై ఎక్కువ బరువును మోపవచ్చు.

గాడిద శాస్త్రీయ నామం ఈక్వస్ అసినస్. ప్రపంచంలో దాదాపు 40 రకాల గాడిదలు ఉన్నాయి. వాటి ముఖం మీద ముక్కు దగ్గర తెల్లగా ఉంటుంది. గాడిదలు సుమారు 90 నుంచి 140 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఇవి దాదాపు 27 నుంచి 40 సంవత్సరాల వరకు బతకగలవు. ఇవి చేసే హీ హా అనే శబ్దం చాలా ప్రత్యేకమైనది. గాడిదలు బాగా ఎక్కువ శబ్దం చేసే జంతువుల్లో ఒకటి.

యంత్రాలు లేని రోజుల్లో గాడిదలను ప్రయాణించడానికి, బరువులు మోయడానికి ఉపయోగించేవారు. పొలం పనులకు, బండ్లు లాగడానికి, నీళ్లు తీసుకురావడానికి, ఇటుకలు లాంటి నిర్మాణ సామాగ్రిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తరలించడానికి ఇవి చాలా ఉపయోగపడేవి. రోమన్లు గాడిద పాలను మందుగా వాడేవారు. ఇంగ్లాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో అయితే చిన్న పిల్లలకు తల్లి పాల బదులుగా గాడిద పాలను ఇచ్చేవారు.

గాడిద తన ముందున్న నేలను వెనకున్న బరువును సరిగ్గా చూసుకొని తాను కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇవి చాలా బలంగా ఉంటాయి. మన దేశంలో చేసిన ఒక పరిశోధన ప్రకారం గాడిదలు తమ బరువు కంటే రెండు రెట్లు ఎక్కువ బరువును కూడా మోయగలవు. బండ్లు లాగడంలో కూడా ఇవి చాలా బాగా ఆరితేరినవి.

గాడిద పాలు పోషకాలు కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. కొన్ని రోగాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అందుకే వాటిని ఎక్కువ ధరకు అమ్ముతారు. గాడిదలు మనకు ఓర్పు, శాంతి, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి విలువలను నేర్పిస్తాయి.