Neem Leaves: పరగడుపున వేపాకులు తింటే.. ఊహించలేని లాభాలు..

|

Sep 13, 2024 | 2:34 PM

వేపాకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి చిన్న పిల్లలకు సైతం తెలుసు. వేపాకు చెట్లు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. వేపాకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. సహజంగా లభించే మెడిసిన్‌లో వేపాకు కూడా ఒకటి. వేపాకు కాస్త చేదు.. తీపి కలిపిన రుచి ఉంటాయి. వేపాకులో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు చాలా ఉన్నాయి. వేపాకు చెట్టు కాయలు, ఆకులు, పువ్వు, బెరడుతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల్ని.

Neem Leaves: పరగడుపున వేపాకులు తింటే.. ఊహించలేని లాభాలు..
Neem Leaves
Follow us on

వేపాకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి చిన్న పిల్లలకు సైతం తెలుసు. వేపాకు చెట్లు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. వేపాకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. సహజంగా లభించే మెడిసిన్‌లో వేపాకు కూడా ఒకటి. వేపాకు కాస్త చేదు.. తీపి కలిపిన రుచి ఉంటాయి. వేపాకులో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు చాలా ఉన్నాయి. వేపాకు చెట్టు కాయలు, ఆకులు, పువ్వు, బెరడుతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల్ని సైతం నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా పలు వ్యాధుల్ని తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. చర్మ సమస్యలు, సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడేవారికి వేపాకు దివ్య ఔషధంలా పని చేస్తుంది. ఇన్ని గుణాలు ఉన్న వేపా ఆకుల్ని పరగడుపున నమిలి తింటే వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడి దూరం అవుతుంది:

ప్రస్తుత కాలంలో ఒత్తిడి అనేది చాలా ఎక్కువై పోయింది. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలాంటి ఒత్తిడిన దూరం చేయడంలో వేప ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇది నాడీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. పరగడుపున వేపాకులు నమిలి తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

చర్మ ఆరోగ్యం:

సాధారణంగా చర్మానికి అనేక రకాల ఇన్ ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. వేపాకులను నమిలి తినడం వల్ల చర్మ అందాన్ని పెంచుకోవచ్చు. ముఖంపై పింపుల్స్, విష పదార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. అంతే కాదు ఇన్ ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. వేపాకుల పేస్టు కూడా ముఖానికి రాసుకోవచ్చు. దీని వల్ల ముఖంపై మెరుపు పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

లివర్ ఆరోగ్యం:

ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేపాకులు తినడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్ సమస్యలతో బాధ పడేవారు ఉదయం ఉదయం వేపాకులు నమలడం చాలా మంచిది. ఇది లివర్‌ని డీటాక్స్ చేసేందుకు అద్భుతంగా పని చేస్తుంది.

అర్థరైటిస్:

వేపాకులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అర్థరైటిస్‌తో బాధ పడేవారు ఉదయం వేపాకులు నమిలి తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.

వెయిట్ లాస్:

ఉదయం పరగడుపును వేపాకులు నమిలి తినడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు అనేది వృద్ధి చెందుతుంది. దీంతో ఆకలి అనేది నియంత్రణలో ఉంటుంది. శరీరంలో క్యాలరీలు కూడా కరుగుతాయి. ఇలా బరువు తగ్గొచ్చు.

ఇమ్యూనిటీ పెరుగుతుంది:

వేపాకులను నమిలి తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బల పడుతుంది. దీంతో ఇతర రోగాలతో పోరాడేందుకు శక్తి లభిస్తుంది. త్వరగా సీజనల్ వ్యాధులు ఎటాక్ చేయకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..