Tulip flowers : విరబూస్తోన్న తులిప్‌ పూలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయ్.. నవ వసంతానికి స్వాగతం పలుకుతున్నాయ్

|

Mar 13, 2021 | 1:42 PM

Tulip flowers in Kashmir : ఎన్నెన్నో వర్ణాల పూలు.. వసంతానికి స్వాగతం పలుకుతున్నాయి.. ముసిముసి నవ్వులతో మది మదినీ ఆకట్టుకుంటున్నాయి. వాటిని చూస్తే ఇంద్రధనుస్సు నేలపైకి వచ్చినట్లు,

Tulip flowers : విరబూస్తోన్న తులిప్‌ పూలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయ్.. నవ వసంతానికి స్వాగతం పలుకుతున్నాయ్
Tulip Kashmir
Follow us on

Tulip flowers in Kashmir : ఎన్నెన్నో వర్ణాల పూలు.. వసంతానికి స్వాగతం పలుకుతున్నాయి.. ముసిముసి నవ్వులతో మది మదినీ ఆకట్టుకుంటున్నాయి. వాటిని చూస్తే ఇంద్రధనుస్సు నేలపైకి వచ్చినట్లు, భూమే రంగుల తివాచీగా మారినట్లు తోస్తుంది. అందమైన జమ్ముకశ్మీర్‌లో విరబూసిన తులిప్‌ పూలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌ పరిధిలోని ఉదాంపూర్‌ జిల్లా హైలాండ్‌ పార్క్‌లో తులిప్‌ పూలు కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల్లో వికసించిన పూలు మైమరిపింపజేస్తున్నాయి. ఐదు రంగుల్లో పూసిన తులిప్‌ పూలు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. మంచు కొండల మధ్యలో తులిప్‌ పూల సోయగాలు కనువిందు చేస్తున్నాయి.

శ్రీన‌గ‌ర్‌లోని తులిప్‌తోట‌.. ఆసియాలోనే అతి పెద్దది. క‌శ్మీర్ సౌంద‌ర్యమంతా శ్రీన‌గ‌ర్‌లో ఇమిడి ఉంటే.. ఆ న‌గ‌ర సోయగం అక్కడ విరిసే పూల‌ల్లో దాగి ఉంటుంది. ఇక్కడ రంగురంగుల పూలు ఇంద్రధనుస్సు నేలపై విరిసినట్లు, పుడమి రంగుల తివాచీగా మారినట్లు తోస్తుంది. ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది తులిప్ తోట‌. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు నిలువెల్లా కనులున్నా చాలవు. ఆ పూల సౌంద‌ర్యాల‌ను చూసేందుకు ప్రతి ఏటా ఏప్రిల్‌లో తులిప్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. ఈ సీజ‌న్‌లో అక్కడ ప‌ర్యాట‌కుల సంద‌డి ఎక్కువ‌గా ఉంటుంది. దేశ‌, విదేశాల నుంచి భారీగా త‌ర‌లివ‌స్తారు. ఈసారి కూడా తులిప్ పూలు బాగా వికసించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువగా 13 లక్షల పువ్వులు వికసించాయి.

Read also : మళ్లీ డ్రగ్స్ రగడ, నటుడు తనీష్‌ సహా ఇంకొందరికి బెంగళూరు పోలీస్ నోటీసులు, ఇంతకీ.. ఎవరా ఐదుగురు..?