TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త తెలిపిన టీఎస్‌ఆర్టీసీ.. వారికి ప్రయాణం ఉచితం..

|

Nov 30, 2021 | 8:37 AM

TSRTC: ఏ అవకాశం వచ్చినా సంస్థ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అడుగులు వేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ముఖ్యంగా సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విప్లవాత్మక మార్పులు దిశగా అడుగులు పడుతున్నాయి...

TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త తెలిపిన టీఎస్‌ఆర్టీసీ.. వారికి ప్రయాణం ఉచితం..
Tsrtc Sabarimala
Follow us on

TSRTC: ఏ అవకాశం వచ్చినా సంస్థ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అడుగులు వేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ముఖ్యంగా సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విప్లవాత్మక మార్పులు దిశగా అడుగులు పడుతున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీనీ గట్టెక్కించేందుకు ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అధికారులు తాజాగా మరో ముందడుగు వేశారు. శబరిమల యాత్రికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో కూడా భక్తులను ఆకర్షించేందుకు గాను ఆర్టీసీ ఆఫర్లను తీసుకొచ్చింది.

ప్రత్యేక బస్సులు అద్దెకు తీసుకున్న వారికి బస్సులో ఐదుగురికి ఉచితం ప్రయాణం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శబరికి వెళ్లడానికి ప్రత్యేక బస్సు బుక్‌ చేసుకున్నవారితో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్‌, పదేళ్లలోపు ఇద్దరు స్వాములకు ఉచితంగా ప్రయాణం కల్పించనున్నారు. సాధారణంగా అయితే అద్దెకు ఇచ్చే బస్సుల్లో ఎంత మంది ఉంటే వారందరికీ ఫుల్‌ టికెట్‌ ఛార్జీ వసూలు చేసేవారు.. కానీ ఆఫర్‌లో భాగంగా ఐదుగురికి ఉచితంగా ప్రయాణం చేసేలా అవకాశం కలిపించింది.

ఈ విషయమై వరంగల్‌ 1 డిపో ట్విట్టర్‌ వేదికగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆసక్తి ఉన్న భక్తులు వివరాల కోసం అధికారులను సంప్రదించాలని కోరారు. ఇక ఛార్జీల విషయానికొస్తే.. 36 సీట్లు ఉన్న సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటర్ రూ.48.96, 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటర్​కు రూ.47.20, 48 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటర్ కు రూ.56.64, 49 సీట్లు ఉన్న ఎక్స్ ప్రెస్ బస్ లకు కిలోమీటర్ కు రూ.52, 43లు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

Also Read: Poorna: డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు కానీ.. కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన పూర్ణ.

Tirumala – Dollar Seshadri: తిరుపతికి డాలర్ శేషాద్రి పార్థీవ దేహం.. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు..

Andhra Pradesh: తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మరో అద్భుత నిర్మాణం.. వైరల్ అవుతున్న ఫోటోలు..