మన దేశంలో రాత్రి ఈ బీట్ లు చూడడం ఓ అద్భుతం.. సముద్రంలో అలలు, ఇసుక మెరుస్తాయి..

బయోలుమినిసెంట్ బీచ్ అంటే రాత్రి సమయంలో సముద్రంలోని చిన్న జీవుల వల్ల నీలం రంగులో మెరిసే బీచ్. సముద్రపు అలలు నీలం, ఆకుపచ్చ స్ఫటికాలలా మెరుస్తాయి. ఇలాంటి దృశ్యం చూడడానికి కలలా లేదా సినిమాలా అనిపించవచ్చు. కానీ మన దేశంలోని కొన్ని బయోలుమినిసెంట్ బీచ్‌లు ఉన్నాయి. అక్కడ పర్యాటకులు నిజంగా జీవితంలో మరచి పోలేని అనుభవాన్ని పొందుతారు. ఈ రోజు ఆ బీచ్‌లు ఏవో తెలుసుకుందాం.

మన దేశంలో రాత్రి ఈ బీట్ లు చూడడం ఓ అద్భుతం.. సముద్రంలో అలలు, ఇసుక మెరుస్తాయి..
Bioluminescent Beaches In India

Updated on: Sep 08, 2025 | 3:51 PM

ట్రిప్ ప్లాన్ చేసుకునే విషయానికి వస్తే చాలా మంది పర్వతాలున్న ప్రదేశాలకు వెళతారు లేదా బీచ్ లొకేషన్‌ను ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ రెండు ప్రదేశాలు సహజ సౌందర్యం, సాహసంతో నిండి ఉన్నాయి. ఈ రోజు దేశంలో ఉన్న బయోలుమినిసెంట్ బీచ్‌ల గురించి తెలుసుకుందాం.. ఇవి పగటిపూట రిఫ్రెషింగ్ అనుభవాన్ని అందిస్తాయి. రాత్రి సమయంలో దృశ్యం పూర్తిగా మాయాజాలంగా ఉంటుంది. ప్రశాంతత మధ్య, సముద్రంలో లేచే అలల శబ్దం , అలల రంగు ఎవరో లక్షలాది స్ఫటికాలను చెల్లాచెదురు చేసినట్లుగా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. బీచ్‌లోని ఇసుక కూడా కాంతిలా మెరుస్తూ కనిపిస్తుంది.

ఆ సమయంలో స్నేహితులు, కుటుంబం లేదా జీవిత భాగస్వామితో బీచ్‌లో గడపడం, ఇసుకలో ఆడుకోవడం లేదా అలలను చూడటం ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మిగులుతుంది. అయితే, ప్రతి సీజన్‌లో బయోలుమినిసెంట్ దృశ్యాన్ని చూడలేరు. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సమయం దీనికి ఉత్తమంగా పరిగణించబడుతుంది. కనుక మన దేశంలో రాత్రి మెరిసే బీచ్ ల గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

బయోలుమినిసెంట్ అంటే ఏమిటి?
బయోలుమినిసెంట్ బీచ్ అంటే రాత్రి సముద్రంలోని చిన్న జీవుల వల్ల అలలు నీలం రంగులో మెరుస్తాయి. డైనోఫ్లాగెల్లేట్‌లు లేదా కొన్ని రకాల జెల్లీ ఫిష్‌ల వంటి సముద్ర జీవులు కదలికకు ప్రతిస్పందనగా కాంతిని విడుదల చేయడం వల్ల జరుగుతుంది. ఈ అద్భుతమైన దృశ్యం ప్రకృతి మాయాజాలం. కాబట్టి సముద్రం, బీచ్‌లో బయోలుమినిసెన్స్ దృశ్యాన్ని చూడాలంటే కొన్ని రుతువులు ఉన్నాయి. భారతదేశంలోని అండమాన్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాలలో చూడవచ్చు

కర్ణాటక మట్టు బీచ్
బయోలుమినిసెన్స్ అనుభవించాలనుకుంటే కర్ణాటకలోని మట్టుబెచ్‌కు వెళ్లవచ్చు. దీనికి సరైన సమయం చీకటి రాత్రి లేదా అర్ధరాత్రి .. (చీకటిగా ఉన్నప్పుడు). అమావాస్య రాత్రి ఈ సముద్ర అందం ఎంత చూసినా తనివి తీరదు.

హావ్‌లాక్ బీచ్, అండమాన్
పగలు అండమాన్ బీచ్‌లలో సమయం గడపడం ఒక అద్భుతమైన అనుభవం అయితే బయోలుమినిసెన్స్ పూర్తిగా వేరే విషయం. ఇక్కడ హేవ్‌లాక్ ఐలాండ్ బీచ్‌లో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. దానిని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

అగట్టి లేదా బంగారం బీచ్, లక్షద్వీప్
లక్షద్వీప్ దేశంలోని ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడ సముద్రాన్ని చూడటం ఉత్తమ అనుభవాలలో ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిచోటా బీచ్‌లు ఉంటాయి. లక్షద్వీప్‌లోని అగట్టి బీచ్ , బంగారం బీచ్‌లలో కూడా బయోలుమినిసెన్స్ దృశ్యాన్ని అనుభవించవచ్చు.

బేతాల్‌బాటిమ్ బీచ్, గోవా
బీచ్ లొకేషన్ విషయానికి వస్తే గోవా దేశంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ ఉన్న శక్తివంతమైన సంస్కృతి ప్రజలను ఆకర్షిస్తుంది. ఇక్కడ గోవా సూర్యాస్తమయం బీచ్.. బెటాల్‌బాటిమ్ బీచ్‌లో బయోలుమినిసెంట్ తరంగాలు రాత్రి ఒక మాయా దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఈ బీచ్ ప్రశాంతమైన వాతావరణం, బంగారు ఇసుకతో ప్రసిద్ధి చెందింది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..