ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్లాలో తోచడం లేదా? అయితే దక్షిణ భారత్‌లోని ఈ ప్రదేశాలను చుట్టేయండి. చల్లచల్లని వాతావరణంతో మీ పర్యాటకాన్ని మరింత ఆహ్లాతభరితం చేసుకోవడానికి ఈ ప్రాంతాలను ఎంపిక చేసుకోండి. దక్షిణ భారతదేశం ప్రకృతి దృశ్యాలు, వారసత్వం, వాస్తుశిల్పం, సాంస్కృతిక ఆనందాలకు నెలవు. దక్షిణ భారత్‌లో టూరిస్ట్ స్పాట్ అనగానే తొలుత గుర్తుకొచ్చే ప్రాంతం.. ఓడరేవు నగరం కొచ్చి. కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ నుంచి కర్ణాటకలోని కాఫీ తోటల వరకు మీ పర్యాటకాన్ని అద్భుతంగా మల్చే ఎన్నో అద్భుత దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. తెలియని ప్రదేశాలను అన్వేషించేటప్పుడు కలిగే ఆనంతం మాటల్లో వ్యక్తపరచలేం. ఈ ఏడాది సందర్శించాల్సిన స్థలాల జాబితాలో వీటినీ చేర్చుకోండి..
తమిళనాడులోని చారిత్రాత్మక అద్భుతం అయిన జింగీ కోట ఎంతో అద్భుతంగా ఉంటుంది. మహోన్నత ప్రాకారాలు, గంభీరమైన కోటలు, క్లిష్టమైన వాస్తుశిల్పం, గత యుగాల కథలు, విశాల దృశ్యాలు గుట్టు విప్పి చెప్పే చిత్రాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. ధాన్యాగారం, దేవాలయం, ప్యాలెస్ శిధిలాలు.. ఒకప్పుడు అభివృద్ధి చెందిన జీవితాలను ప్రతిధ్వనించాయి. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం శాశ్వతమైన జ్ఞాపకాలను అందిస్తుంది.
కాంతల్లూర్ కేరళలోని ఒక చిన్న గ్రామం.. కాల క్రమేణా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. సుందరమైన పచ్చికభూములు, నిర్మలమైన పండ్ల పొలాలు, సహజమైన జలపాతాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.
తెంకాసిలోని అల్వార్‌కురిచికి సమీపంలో ఉన్న గడనానతి డ్యామ్‌ను కడనా నతి ఆనకట్ట అని కూడా పిలుస్తారు. నిర్దిష్ట సీజన్లలో మాత్రమే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. పశ్చిమ కనుమల వద్ద నిర్మించిన ఈ డ్యామ్ సహజమైన వాతావరణంలో నిర్మలమైన అనుభవాలను కోరుకునే వారికి మంచి అనుభూతిని ఇస్తుంది.
కర్ణాటకలోని కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం సమీపంలోని మాల అనే గ్రామం ఇది. మన్నపాపుమనే అనే 300 సంవత్సరాల పూర్వీకుల మంగుళూరు నివాస గృహాలు ఇక్కడ ఉన్నాయి. మార్చిలో మండే వేడి కర్ణాటకలోని ఈ హిల్ స్టేషన్ కనిపించదు. వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉంటుంది.
ఉత్తర కర్ణాటకలో గడగ్ అనే ఒక చిన్న సిటీ ఇది. విభిన్న సాంస్కృతిక గొప్పతనాన్ని, పాక నైపుణ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ అందమైన సిటీలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో నిత్యం 800 మందికిపైగా భోజనం అందిస్తుంటారు. చరిత్ర, కళ, సంస్కృతి సమ్మేళనంతో ఉత్తర కర్ణాటకలో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటిగా గడక్ పేరు గాంచింది.
మరిన్ని పర్యాటక కథనాల కోసం క్లిక్ చేయండి.