వెకేషన్ కు ప్రిపేర్ అవుతున్నారా.? ఎప్పుడు ఊటీ, కొడైకెనాల్, జమ్మూ కాశ్మీర్ ఇవేనా..? ఈ సారి ఇండియా దాటి వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే ఇంకేం వీసా అవసరం లేకుండానే భారతీయులకు స్వాగతం పలుకుతుంది థాయిలాండ్. అదేంటీ పరాయి దేశంలో వీసా లేకుండా ఎలా అనుకుంటున్నారా.? నమ్మలేకున్నారా.? అవును నిజమే.! ఇండియా తో పాటు మరో దేశం తైవాన్ నుండి వచ్చే వారికీ ముప్పై రోజుల పాటు థాయిలాండ్ లో పర్యటించేందుకు మార్గం సుగుమం చేసింది థాయ్ ప్రభుత్వం. పోయిన నెల నుండే చైనా దేశం నుండి వచ్చే టూరిస్టులకు థాయ్‌లాండ్ ప్రభుత్వం వీసా లేకుండా పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే మలేషియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత ఇండియా నుండే పెద్ద సంఖ్యలో టూరిస్టులు థాయ్‌లాండ్ కు వస్తున్నారు.
థాయిలాండ్ టూరిజం శాఖ లెక్కల ప్రకారం 2023 జనవరి నుండి అక్టోబర్ వరకు దాదాపు 22 మిలియన్ల టూరిస్టులు థాయ్‌లాండ్‌లో పర్యటించారు. ఈ టూరిస్టుల విజిట్ వల్ల దాదాపు 25.67 బిలియన్ డాలర్ ఆదాయం థాయ్ ప్రభుత్వం కు వచ్చినట్టు సమాచారం. థాయ్‌లాండ్‌లో చూడాల్సిన ప్రదేశాల్లో బ్యాంకాక్, క్రబి, పుకెట్, పిఫీ దీవులు మొదటి లైన్ లో ఉంటాయి. ప్రదేశాలతో పాటు అక్కడ ఫుడ్, నైట్ క్లబ్‌లు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్.
అయితే ఆయా దేశాలకు ఇప్పటికే వీసా లెస్ టూర్ కు అనుమతి ఇచ్చిన థాయ్ ప్రభుత్వం కొద్దీ రోజుల నుండి శ్రీలంక కూడా థాయ్ బాటలో భారత్ సహా ఏడు దేశాల నుండి వచ్చే టూరిస్టులకు వీసా లేకుండానే టూరిస్ట్ ప్లేస్ ల విజిట్ కు అనుమతివ్వాలని డిసైడ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇండియాతో పాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్ లాండ్ దేశాలు ఈ జాబితాలో ఉండగా 2024, మార్చి 31 నుంచి ఈ నిబంధనలు అమలులో ఉంటాయని శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. శ్రీలంక నిర్ణయం ఇక మనం థాయ్ లాండ్ ను కూడా వీసా లేకుండానే తిరిగేయచ్చు.. ఇంకేం ఇంత గొప్ప విషయం తెలిసాక చూస్తూ ఉంటారా టికెట్స్ బుక్ చేయండి మరి టూర్ ప్లాన్ లో బిజీ అవ్వండి.
Flights by Arkia (211 passengers), El Al (70 passengers)&Thai Airways (278 passengers arrived in TH last night/this morning, with rep from Consular Affairs Dept and relevant agencies facilitated them with assistance measures before returning to their hometowns (1 Nov 23) pic.twitter.com/xj6ITzSwn3
— กระทรวงการต่างประเทศ | MFA of Thailand (@MFAThai) November 1, 2023
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి