Tourism: టూరిస్టులకు స్వర్గధామం.. భారత్‌లోనే టాప్ స్థానంలోకి ఆ రాష్ట్రం
దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కేరళ రాష్ట్రం ఒకటి. పర్యావరణ పర్యాటకం, అందమైన బ్యాక్ వాటర్స్, ఫేమస్ బీచ్‌లు, హిల్ స్టేషన్లు, జలపాతాలు, సంస్కృతి, వైవిధ్యమైన జనాభా వంటివి కేరళను మంచి టూరింగ్ స్పాట్ గా మార్చాయి. ఈ రాష్ట్రానికి నిత్యం పర్యాటకుల తాకిడి ఉంటూనే ఉంటోంది. తాజాగా టూరిజం విభాగంలో కేరళ మరో మైలు రాయిని అందుకుంది.

భారతదేశంలో ‘అత్యంత స్వాగతించే ప్రాంతాల’ జాబితాలో స్థిరంగా స్థానం సంపాదించుకున్న కేరళ, ఈ సంవత్సరం తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది, మూడవ స్థానం నుండి రెండవ స్థానానికి చేరుకుంది. గ్లోబల్ డిజిటల్ ట్రావెల్ కంపెనీ అయిన బుకింగ్ డాట్ కామ్ అనే సైట్ ద్వారా ర్యాంకింగ్, 360 మిలియన్లకు పైగా కస్టమర్ సమీక్షల ఆధారంగా ఈ లిస్టును తయారు చేశారు. సందర్శకులను ఆకర్షించడానికి కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్న రాష్ట్ర పర్యాటక పరిశ్రమకు ఇది ఒక ప్రోత్సాహకంగా మారింది.
వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం, కేరళ ర్యాంకింగ్‌లో మరో ముఖ్యాంశం ఏమిటంటే, భారతదేశంలోని అత్యంత స్వాగతించే నగరాల జాబితాలో మరారికులం, తెక్కడి మరియు అలప్పుజ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలు మున్నార్ మరియు వర్కల. “ఇది రాష్ట్రం పర్యాటకులకు అందించే విభిన్న అనుభవాన్ని ప్రదర్శిస్తుంది” అని వెబ్‌సైట్ పేర్కొంది.
కేరళలో సందర్శించడానికి ప్రసిద్ధ ప్రదేశాలు.. అలెప్పి, కొట్టాయం, బేకల్, వాగమోన్, వర్కల, కుమరకోమ్, వాయనాడ్, కోవలం, కొచ్చిన్, మున్నార్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు పెరియార్ నేషనల్ పార్క్, వెంబనాడ్ బీచ్, మట్టన్చేరి ప్యాలెస్, చెరై బీచ్, గురువాయూర్ ఆలయం, అతిరాపల్లి జలపాతాలు కూడా పేరుగాంచాయి.
గొప్ప సాంస్కృతిక వారసత్వం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణ ప్రియుల అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. వెబ్‌సైట్ ప్రకారం, రాష్ట్రంలోని ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, పచ్చని ప్రకృతి దృశ్యాలు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వం అన్ని వయసుల ప్రయాణికులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ గమ్యస్థానాలు విశ్రాంతి మరియు అడ్వంచర్ కోరుకునే వారికి మంచి ఎంపికగా మారుతున్నాయి. ప్రశాంతత లేదా ఉత్సాహాన్ని కోరుకునే వారికి కూడా ఈ ప్లేస్ సరిగ్గా సరిపోతుంది.
కేరళ పర్యాటనకు ఉత్తమ సమయం
సెప్టెంబర్ నుండి మార్చి మధ్య శీతాకాలం కేరళను సందర్శించడానికి ఉత్తమ సమయం. ఈ సమయంలో కేరళలో సౌకర్యవంతమైన వాతావరణం ఉంటుంది. మరారికులం, తేక్కడి మరియు అలప్పుజ టాప్ 10 ‘భారతదేశంలో అత్యంత స్వాగతించే నగరాల్లో’ స్థానం పొందాయి. మున్నార్ మరియు వర్కల కూడా జాబితాలో చోటు సంపాదించాయి. రాష్ట్రంలోని ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, పచ్చని ప్రకృతి దృశ్యాలు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వం అన్ని వయసుల ప్రయాణికులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.
