Irctc Tamilnadu Tour Package
వేసవి నుంచి ఉపసమనం కోసం మాత్రమే కాదు.. రొటీన్ లైఫ్ నుంచి రిలీఫ్ కోసం కూడా సుదీర్ఘ సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్లాలని కోరుకుంటారు. కొంతమంది ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యటించాలని కోరుకుంటే మరికొందరు ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయాలనీ భావిస్తారు. ఈ నేపధ్యంలో పర్యాటకుల కోసం IRCTC వారు వివిధ రూపాల్లో స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకోచింది. దేశ, విదేశాల్లో ప్రముఖ క్షేత్రాలు పర్యాటక ప్రాంతాల దర్శనం కోసం ఎదురుచూస్తున్న వారికి అందుబాటులోకి వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనుకునే తెలుగు వారి కోసం స్పెషల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు ఐఆర్సీటీసీ టూర్ ను అందిస్తోంది. ఈ ఎయిర్ టూర్ ఆగస్టు 13తేదీన ప్రారంభమై 18.వ తేదీ ఆగష్టు న ముగుస్తుంది. మొత్తం ఈ టూర్ ఆరో రోజుల పాటు సాగనుంది. ఈ టూర్ లో తమిళనాడులోని కుంభకోణం, మధురై, రామేశ్వరం, తంజావూరు, ధనుష్కోడి వంటి ప్రముఖ ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించవచ్చు.
టూర్ షెడ్యుల్ వివరాల్లోకి వెళ్తే..
ఫస్ట్ డే టూర్: టూర్ లో మొదటి రోజు ఆగస్టు 13 వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రానికి తిరుచ్చి చేరుకుంటారు. అక్కడ ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసిన వారు ఎయిర్ పోర్టులో పికప్ చేసుకుని బస నిమిత్తం హోటల్ కి తీసుకెళ్తారు. రాత్రి తిరుచ్చిలోనే బస చేయాల్సి ఉంటుంది.
రెండో రోజు టూర్: మర్నాడు అంటే ఆగష్టు 14 వ తేదీ తిరుచ్చిలో ఉదయం అల్పాహారం చేసి.. హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. అనంతరం శ్రీరంగం ఆలయాన్ని, జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం తంజావూరుకు వెళ్లి బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కుంభకోణంకి వెళ్లి ఐరావతేశ్వర ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. రాత్రి కుంభకోణంలోని హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది.
మూడో రోజు టూర్: కుంభకోణంలోని హోటల్ లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్న అనంతరం చిదంబర ఆలయానికి వెళ్లి నటరాజ స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి గంగైకొండ చోళపురం వెళ్లి అక్కడ అందాలను వీక్షించవచ్చు. మధ్యాహ్నం తిరిగి కుంభకోణం చేరుకొని కాశీ విశ్వనాథర్, సారంగపాణి, ఆది కుంభేశ్వర ఆలయం వంటి స్థానిక ఆలయాలను సందర్శించవచ్చు. మళ్ళీ రాత్రికి కుంభకోణంలో హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది.
నాల్గో రోజు టూర్: ఉదయం కుంభకోణం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి రామేశ్వరానికి వెళ్ళాల్సి ఉంటుంది. రామేశ్వరం చేరుకున్న తర్వాత హోటల్‌లో బస చేయాలి. రామనాథస్వామిని దర్శించుకోవాలి. రాత్రి రామేశ్వరంలో బస చేయాలి.
ఐదో రోజు టూర్: టూర్ లో ఐదో రోజు తెల్లవారు జామున ధనుష్కోడికి చేరుకుని సూర్యోదయాన్ని ఎంజాయ్ చేసి ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం అల్పాహారం తీసుకుని
అబ్దుల్ కలాం మెమోరియల్‌ని సందర్శించాల్సి ఉంటుంది. తర్వాత మధురైకి వెళ్లి రాత్రికి మధురైలో బస చేయాలి.
ఆరో రోజు టూర్: టూర్ లో చివరి రోజు ఉదయం హోటల్ లో అల్పాహారం తిని మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాలి. తిరిగి హైదరబాద్ ప్రయాణం కావాలి.మధ్యాహ్నం మధురై ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ప్రయాణించి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు ఐఆర్సీటీసీ టూర్ ముగుస్తుంది.
టికెట్ ప్యాకేజీ డీటైల్స్:
- సింగిల్ ఆక్యుపెన్సీ – టికెట్ ధర రూ.39,850
- డబుల్ ఆక్యుపెన్సీ – టికెట్ ధర రూ.30,500
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ – టికెట్ ధర రూ.29,250
- 5 నుంచి 11 సంవత్సరాలు పిల్లలకు చైల్డ్ విత్ బెడ్ ధర రూ.26800
- 5 నుంచి 11 సంవత్సరాల చైల్డ్ వితవుట్ బెడ్ ధర రూ.22600
- 2 నుంచి 4 సంవత్సరాలుచైల్డ్ వితవుట్ బెడ్ రూ.16800
హైదరాబాద్ నుంచి ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ రూ.29,250 ధరతో ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో మొత్తం 29 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.