IRCTC Tour Package: అత్యంత తక్కువ ప్యాకేజీతో నాలుగు రోజులపాటు గుజరాత్‌ను చుట్టిరండి.. ఐఆర్‌సీటీసీ ప్రకటించిన బంపర్ ఆఫర్..

భారతీయ రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు మంచి మంచి ప్యాకేజీలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో స్టాట్యూ ఆఫ్ యూనిటీ, అహ్మదాబాద్, వడోదరను సందర్శించడానికి మీకు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. ఈ ప్యాకేజీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

IRCTC Tour Package: అత్యంత తక్కువ ప్యాకేజీతో నాలుగు రోజులపాటు గుజరాత్‌ను చుట్టిరండి.. ఐఆర్‌సీటీసీ ప్రకటించిన బంపర్ ఆఫర్..
Statue Of Unity

Updated on: Jul 12, 2023 | 12:25 PM

IRCTC Tour Package: గుజరాత్‌ని సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. భారతీయ రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ, గుజరాత్‌ను సందర్శించడానికి కొత్త రైలు టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్రయాణం ప్రతి శుక్రవారం ముంబై నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి కెవాడియా విత్ అహ్మదాబాద్ ఎక్స్ ముంబై అని పేరు పెట్టారు. ఐఆర్‌సీటీసీ ఈ మేరకు ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీ 4 పగలు, 3 రాత్రులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులు చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లలో ప్రయాణించవచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా, పర్యాటకులు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అహ్మదాబాద్, వడోదరను సందర్శించే అవకాశం లభిస్తుంది.

టూర్ ప్యాకేజీల కోసం ఆక్యుపెన్సీని బట్టి టారిఫ్ మారుతుంది. ఈ ప్రయాణానికి ఒక వ్యక్తికి రూ. 15,440 నుంచి ధర ప్రారంభమవుతుంది.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం

గుజరాత్‌లోని వడోదరకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించిన భారీ విగ్రహాన్ని చూడటానికి చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళతారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 597 అడుగుల విగ్రహాన్ని నర్మదా నది ద్వీపంలో నిర్మించారు.

  • టూర్ ప్యాకేజీ 8 రాత్రులు, 9 రోజుల
  • డెస్టినేషన్ కవర్లు – అహ్మదాబాద్ , వడోదర
  • ప్యాకేజీ పేరు – కెవాడియా విత్ అహ్మదాబాద్ ఎక్స్ ముంబై (WMR148)
  • క్లాస్ – చైర్ కార్ & ఎగ్జిక్యూటివ్ చైర్ కార్
  • మీల్ ప్లాన్ – బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ & ఆన్‌బోర్డ్ మీల్

ఐఆర్‌సీటీసీకి చెందిన అధికారిక వెబ్‌సైట్ ని వెళ్లండి.. అక్కడ ఈ టూర్ ప్యాకేజీ కోసం బుకింగ్  చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ప్యాజీలను ఐఆర్సీటీసీ అందిస్తోంది. పూర్తి విరాలను IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు,  రీజినల్  కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు.

మరిన్ని టూరిజం న్యూస్ కోసం