Bharat Darshan Tour: దేశంలోని ప్రముఖ ప్రాంతాలను తక్కువ ధరతో చూసే అవకాశం కల్పిస్తూ స్పెషల్ ట్రైన్.. వివరాల్లోకి వెళ్తే..

|

Aug 10, 2021 | 10:49 AM

Bharat Darshan Tour: కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం మళ్ళీ పర్యాటకులను ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్..

Bharat Darshan Tour: దేశంలోని ప్రముఖ ప్రాంతాలను తక్కువ ధరతో చూసే అవకాశం కల్పిస్తూ స్పెషల్ ట్రైన్.. వివరాల్లోకి వెళ్తే..
Bharat Darshan Tour
Follow us on

Bharat Darshan Tour: కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం మళ్ళీ పర్యాటకులను ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘భారత్ దర్శన్’ పేరుతో ఒక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ఆగస్టు 29 న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 10 న ముగుస్తుంది. 13 రోజుల పాటు సాగనున్న ఈ టూర్ కోసం IRCTC “భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్” ను ఏర్పాటు చేస్తోంది.

ఈ రైలు హైదరాబాద్, అహ్మదాబాద్, భావనగర్‌లోని నిష్కలంక్ మహాదేవ్ సముద్ర దేవాలయం, అమృత్సర్, జైపూర్ , స్టాట్యూ ఆఫ్ యూనిటీతో సహా వివిధ పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ ప్యాకేజీ వివాలను IRCTC టూరిజం వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం.. భారత్ దర్శన్ ప్యాకేజీ అత్యంత సరసమైన ధరకు అందిస్తుంది. లాడ్జింగ్, బోర్డింగ్ వంటివి అన్ని సదుపాయాలను కలిపి టూర్ ప్యాకేజీగా అందిస్తుంది. దేశంలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ప్రత్యేక రైలు ద్వారా కవర్ చేయబడతాయి.

భారత్ దర్శన్ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునే వారు IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వ్యక్తులు IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ ఆఫీస్‌లు , రీజనల్ ఆఫీసులను సందర్శించి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
అయితే ఈ పర్యటనకు వెళ్లే పర్యాటకులు తప్పని సరిగా వ్యాక్సినేషన్ కంప్లీషన్ సర్టిఫికెట్ (2 డోస్‌లు), లేదా RT-PCR నెగటివ్ రిపోర్ట్ ని తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీపిసిఆర్ రిపోర్ట్ కేవలం 48 గంటల ముందుమాత్రమే తీసుకోవాలి ఉంటుంది.

పర్యాటకులకు ప్రయాణ భీమా , శానిటైజేషన్ కిట్లు అందించబడతాయి. స్థానిక రవాణా ఖర్చులు, స్మారక చిహ్నాల ప్రవేశ రుసుము, బోటింగ్ ఛార్జీలు, పర్యాటక గైడ్ సేవలను పర్యాటకులు స్వయంగా భరించాల్సి ఉంటుంది.

బోర్డింగ్ పాయింట్లు: మధురై, సేలం, దిండిగల్, ఈరోడ్, జోలార్‌పేట కరూర్, కాట్‌పాడి, MGR చెన్నై సెంట్రల్, నెల్లూరు, విజయవాడ

డి-బోర్డింగ్ పాయింట్లు: విజయవాడ, నెల్లూరు, పెరంబూర్, కాట్‌పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, కరూర్, దిండిగల్, మధురై

 

Also Read: Psyche Asteroid: అంతరిక్షంలో రూ.72 కోట్ల కోట్లు ఖరీదు చేసే రాయి.. భూమిమీద తీసుకుని రావడానికి ప్రయత్నాలు