
దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని మనలో చాలా మంది కోరుకుంటారు. అయితే జ్యోతిర్లింగాలు దూరప్రాంతంలో ఉండడంతో చాలా మంది వెళ్లాలని ఉన్నా వెల్లలేని పరిస్థితి. ఇలాంటి వారి కోసమే భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ ఓ సూపర్ టూర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ఎలాంటి రిస్క్ లేకుండా జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పించింది. ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు వీలుగా మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను కవర్ చేయనున్నారు. ఈ టూర్‌లో భోపాల్, సాంచి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రస్తుతం మార్చి13వ తేదీన అందుబాటులో ఉంది. 5 రాత్రులు, 6 రోజుల ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టూర్ ఇలా సాగుతుంది..
* తొలిరోజు బుధవారం సాయంత్రం 04. 40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ 12707 రైలులో ప్రయాణం మొదలవుతుంది.
* రెండో రోజు గురువారం ఉదయం 8.15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత సాంచి స్తూపాన్ని దర్శించుకుంటారు. అనంతరం భోపాల్‌లోని ట్రైబల్ మ్యూజియం, తాజ్ ఉల్ మసీదును సందర్శిస్తారు. రాత్రి బస భోపాల్ ఉంటుంది.
* ఇక మూడో రోజు శుక్రవారం భోపాల్‌లో హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత ఉజ్జయినికి బయల్దేరుతారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి ఉజ్జయినిలోనే బస చేస్తారు.
* నాల్గవ రోజు శనివారం.. ఓంకారేశ్వర్‌కు చేరుకుంటారు. అక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. రాత్ర బస ఇక్కడే ఉంటుంది.
* ఇక ఐదవ రోజు ఆదివారం.. మహేశ్వర్ కు బయల్దేరారు. అక్కడ ఐలాదేవి ఫోర్టు, మండు ఫోర్టు చూసిన తర్వాత ఇండోర్ కు బయల్దేరుతారు. రాత్రి 7 గంగలకు అంబేద్కర్ రైల్వే స్టేషన్ చేరుకొని తిరుగు ప్రయాణం మొదలువుతుంది.
* ఆరవ రోజు సోమవారం రాత్రి 10 గంటలకు కాచిగూడకు చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
సింగిల్ షేరింగ్‌కు రూ. 37,810గా నిర్ణయించారు. ఇక డబుల్ షేరింగ్ విషయానికొస్తే రూ. 21,150, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 16,390గా నిర్ణయించారు. అయితే ఇవి ఏసీ కోచ్‌లో ధరలు. సెకాండ్ క్లాస్ ఏసీ, స్లీపర్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..