IRCTC Tour Package: భూతల స్వర్గం భూటాన్.. తక్కువ బడ్జెట్‌లో వెళ్లొద్దామా..

ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్త విశ్రాంతి కోరుకుంటున్నారా.. ఇంటర్నేషనల్ ట్రిప్పే కానీ మీ బడ్జెట్ లో దొరికితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి ఓ అవకాశాన్నే ఐఆర్ సీటీసీ కల్పించనుంది. తక్కువ ధరతో అదిరిపోయే టూర్ ప్లాన్ ను ప్రకటించింది. సెలవుల్లో ఫ్యామిలీతో గడపడానికి ఇదో మంచి అవకాశం. మరి ఈ ప్యాకేజీ వివరాలేంటో చూసేయండి.

IRCTC Tour Package: భూతల స్వర్గం భూటాన్.. తక్కువ బడ్జెట్‌లో వెళ్లొద్దామా..
Bhutan

Edited By:

Updated on: Feb 09, 2025 | 11:31 PM

ఇండియా పక్కనే ఓ అందమైన ప్రపంచం. చుట్టూ కొండలు, మధ్యలో సుందరమైన ఆవాసాలు. ఇంకా అంతరించిపోని రాచరిక పాలన.. సుందర వనాలకు, ప్రసిద్ధిగాంచిన దేవాలయాలకు నిలయం. అదే భూటాన్ దేశం. చిన్న దేశమే కానీ చింతలేని ప్రజలు. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన జీవితం గడుపుతున్న ప్రజలు వీరే కావడం మరో విశేషం. ఈ అందమైన టూర్ కోసం ఐఆర్ సీటీసీ కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ప్రయాణ చార్జీలు, భోజన సౌకర్యాలు, వసతి కూడా ఉన్నాయి. రాయల్ భూటాన్ ఇంటర్నేషనల్ ప్యాకేజీ పేరుతో దీనిని తీసుకొచ్చింది.

భూతల స్వర్గం.. భూటాన్

ఒకప్పుడు ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టుగా ఉండే ఈ దేశం ఇప్పుడిప్పుడే ఇంటర్నెట్ సాయంతో అభివవృద్ది చెందుతోంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. వీరి సంప్రదాయ వేషధారణ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. హిందూ మతం రెండో అతిపెద్ద మతంగా ఉంది. కలుషితం కాని ప్రకృతి వనరులు ఈ దేశానికి మరో ప్రత్యేకత. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే ఈ దేశం సహజ అందాలతో కనువిందు చేస్తోంది.

భూటాన్ టూర్ ప్యాకేజీ వివరాలు..

తక్కువ బడ్జెట్ లోనే..

కోల్ కతా నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. 9 రాత్రులు, 10 పగళ్లు ట్రిప్ ఉండనుంది. ప్రతి శనివారం సీల్దా నుంచి ట్రైన్ బయలుదేరి వెళ్తుంది. ఇందుకు సంబంధించి భూటాన్ అందాలను చూపుతూ ఐఆర్ సీటీసీ విడుదల చేసిన వీడియో ఒకటి కనువిందు చేస్తోంది. టికెట్ ప్రారంభ ధర రూ. 63,900గా తెలిపింది. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవాలనుకునేవారు ముందుగా ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ కు వెళ్లి దానిలో బుక్ నౌ అనే ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు.