Kamrunag Lake: ఆ సరస్సులో చేతికందేలా కోట్ల విలువజేసే నిధి.. అయినా ఎవరూ టచ్ కూడా చేయరు.. ఎందుకంటే

|

Jun 11, 2022 | 6:35 PM

Kamrunag Lake: సంవత్సరాలుగా ప్రజలు సమర్పించిన డబ్బు, ఆభరణాల కారణంగా.. ఈ సరస్సులో వేలకోట్ల నిధి ఉందని తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద నిధి సరస్సులో ఉన్నప్పటికీ.. ఆలయంలో ఎటువంటి భద్రత లేదు..

Kamrunag Lake: ఆ సరస్సులో చేతికందేలా కోట్ల విలువజేసే నిధి.. అయినా ఎవరూ టచ్ కూడా చేయరు.. ఎందుకంటే
Kamrunag Lake
Follow us on

Kamrunag Lake: హిమాచల్ ప్రదేశ్ యూ దేవతల భూమిని అంటారు. అందమైన ప్రకృతికి ఆలవాలం.. ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన ఆలయాలు.. సైన్స్ కు అందని రహస్యాలకు నెలవు. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ అందమైన మైదానాలు, లోయలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ రాష్ట్రంలోని అందాలను చూడటానికి వస్తారు. అయితే ఈ హిమాచల్ భూభాగంలో ఓ అందమైన సరస్సు .. తనలో కోట్లాది సంపదను దాచుకుందని మీకు తెలుసా..! ఈరోజు ఆ సరస్సు.. పురాతన విశిష్టత.. గురించి తెలుసుకుందాం..

కమ్రునాగ్ సరస్సు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాకు 51 కి.మీ దూరంలో కర్సోగ్ లోయలో ఉంది. దీనిని కమ్రునాగ్ సరస్సు అని కూడా అంటారు. పరాశరుడు అనే సాధువు ఈ ప్రదేశంలో ధ్యానం చేయడం వలన ఈ సరస్సుకు అతడి పేరు వచ్చింది.ఈ సరస్సు వద్దకు భక్తులు వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందమైన ఈ సరస్సుని చూడగానే భక్తుల తమ అలసట అంతా పోయిందని చెబుతారు. ఈ ప్రదేశంలో రాతితో చేసిన కమ్రునాగ్ బాబా విగ్రహం ఉంది. ప్రతి సంవత్సరం జూన్‌లో కమ్రునాగ్ ఆలయంలో జాతర నిర్వహిస్తారు.

మహాభారత కాలానికి చెందిన ఈ సరస్సు రహస్యం..   
ఈ సరస్సులో బంగారం-వెండి, డబ్బులు సమర్పిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాల నాటినుంచి కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ప్రజలు తమ కోరికలు నెరవేరిన తర్వాత వారి విశ్వాసం ప్రకారం బంగారం, వెండిని సమర్పిస్తారు. ఇవి సరస్సు నీటిలో స్పష్టంగా కనిపిస్తాయి. సంవత్సరాలుగా ప్రజలు సమర్పించిన డబ్బు, ఆభరణాల కారణంగా.. ఈ సరస్సులో వేలకోట్ల నిధి ఉందని తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద నిధి సరస్సులో ఉన్నప్పటికీ.. ఆలయంలో ఎటువంటి భద్రత లేదు.. అయితే ఇక్కడ సరస్సులోని నిధిని కమ్రునాగ్ దేవత స్వయంగా కాపాడుతుందని భక్తుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

సరస్సులో పడివున్న నిధి పాండవుల సొత్తు అని పౌరాణిక కథనం కూడా ఉంది.  ఈ సరస్సుని పాండవుల సోదరుడు భీముడు సృష్టించాడని.. కమ్రునాగ్ సాధువుకి అంకితం చేసినట్లు ఓ కథనం. ఈ సాధువు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శనం ఇస్తారని.. అదీ జూన్ అని ఇక్కడి ప్రజలు చెబుతారు. జూన్ నెలలో ఇక్కడ ఒక జాతర నిర్వహిస్తారు. ఈ జాతరను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడకు వస్తారు. ఈ సమయంలో ప్రజలు కోరుకున్న వరుడిని పొందడానికి సరస్సులో బంగారం, వెండి, డబ్బును సమర్పిస్తారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..