AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Slowest Train: మన దేశంలో నెమ్మదిగా నడిచే రైలు ఇదే.. సైకిల్ కంటే స్లోగా వెళ్ళే టాయ్ ట్రైన్.. జర్నీ ఓ మధుర జ్ఞాపకం..

రైలు ప్రయాణమే ఒక గొప్ప అనుభూతినిస్తే.. అందమైన పర్వతాల లోయల గుండా రైలు ప్రయాణిస్తున్నప్పుడు.. ఆ దృశ్యాన్ని చూడడం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే రైలు వేగంగా ప్రయాణించడం వలన మనకు నచ్చిన మనసు మెచ్చిన ప్రకృతి దృశ్యాలను వీడియోలు తీయడానికి లేదా ఫోటోలు క్లిక్ చేయడానికి అయినా కష్టమే. అయితే ఒక ట్రైన్ లో ప్రయాణిస్తే మాత్రం మీకు నచ్చినట్లు ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్ వేగం సైకిల్ కంటే తక్కువ.

India Slowest Train: మన దేశంలో నెమ్మదిగా నడిచే రైలు ఇదే.. సైకిల్ కంటే స్లోగా వెళ్ళే టాయ్ ట్రైన్.. జర్నీ ఓ మధుర జ్ఞాపకం..
Tory Train India Slowest Train
Surya Kala
|

Updated on: Jun 29, 2025 | 11:44 AM

Share

భారతదేశ ప్రజలు రైలులో ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి ఎవరైనా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే.. రైలులో ప్రయనించడానికి ఎంచుకుంటారు. ఎందుకంటే తమ బడ్జెట్ కు అనుగుణంగా మాత్రమే కాదు ట్రైన్ ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో కుటుంబంతో ప్రయాణించాల్సి వస్తే రైలు ఉత్తమమైనది. అంతేకాదు ట్రైన్ లో ప్రయాణించే సమయంలో విండో సీటు కావాలని కోరుకుంటారు. రైలు పచ్చని అడవుల మధ్య వెళుతున్నప్పుడు.. ఈ పచ్చదనం మనతో పాటు మనం కూడా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. రహదారి అద్భుతంగా కనిపిస్తుంది. పర్వతాల రైలు ట్రాక్ విషయానికి వస్తే, దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ తమ ఫోన్ కెమెరాలో ప్రతి అందమైన విషయాన్ని బంధించాలని కోరుకుంటారు. అయితే కెమెరా నిశ్చలంగా ఉండాలి. రైలు వేగంతో ఇది సాధ్యం కాదు. ప్రస్తుతం, అందమైన లోయల గుండా ప్రయాణించే సమయంలో చాలా నెమ్మదిగా కదిలే రైలు ఉండాలి.

రైలు ఎత్తైన పర్వతాల గుండా వెళ్తున్న సమయంలో ప్రతిచోటా అందమైన దృశ్యాలు కనిపిస్తే.. అపుడు మీ రైలు వేగం సైకిల్ వేగం కంటే తక్కువగా ఉంటే.. ఆ ప్రయాణం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు ఈ రైలులో ప్రయాణం ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది.. తెలుసుకుందాం.

ఆ ట్రైన్ ఏమిటి? ఎక్కడ ప్రయాణిస్తుందంటే? అందమైన పర్వత లోయల గుండా నెమ్మదిగా ప్రయాణించే రైలు పేరు ‘మెట్టుపాలయం-ఊటీ ప్యాసింజర్ రైలు’. దీనిని ‘నీలగిరి పర్వత రైల్వే సంస్థ’ నడుపుతుంది. దీనిని టాయ్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. తమిళనాడులో మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు నడిచే ఏకైక రైల్వే ట్రాక్ ఇది. అందమైన దృశ్యాలను చూడటానికి ఇది ఒక గొప్ప అవకాశం. కనుక ఈ రైలు పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది.

ఇవి కూడా చదవండి

ఆ రైలు వేగం ఎంత? ఈ రైలు వేగం ఎంత అంటే.. ఇది దాదాపు 5 గంటల్లో 46 కి.మీ దూరాన్ని ప్రయాణిస్తుంది. ఇది సాధారణ రైలు వేగం కంటే చాలా ఎక్కువ. దీని ప్రకారం ఈ రైలు గంటకు 10 నుంచి 15 కి.మీ వేగంతో నడుస్తుంది. సగటున సైకిల్ ద్వారా 25 కి.మీ ప్రయాణాన్ని గంటలోపు పూర్తి చేయవచ్చు. అంటే ఈ రైలు వేగం సైకిల్ కంటే తక్కువ. కనుక అందమైన లోయలను ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం వరకు ప్రతిదీ సులభంగా చేయవచ్చు.

ఈ రైలు యునెస్కో వారసత్వ సంపద. ఈ రైలును 1908లో బ్రిటిష్ వారు ప్రారంభించారు. నేటికీ ఇది నడుస్తోంది. 2005లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ రైలు గేజ్ రైల్వే లైన్‌పై నడుస్తుంది. ఇది నిటారుగా ఉన్న వాలు కలిగి ఉంటుంది. అందుకే రైలు వేగం తక్కువగా ఉంటుంది. దాని ట్రాక్‌లో 250 వంతెనలు, 208 వంకరలు, 16 సొరంగాలు ఉన్నాయి.

ఈ రైలు బాలీవుడ్‌లో కూడా కనిపించింది ఈ రైలును 1998 చిత్రం ‘దిల్ సే’లో కూడా చూపించారు. మలైకా అరోరా షారుఖ్ ఖాన్ పాడిన ‘చైయా ఛాయా’ పాటలో ఈ రైలు పైకప్పుపై నృత్యం చేస్తూ కనిపించారు. ఇది నీలగిరి పర్వత రైల్వే రైలు. ఈ పాట ఇప్పటికీ చాలా ప్రజాదరణ పొందుతూనే ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..