Travel News: హిమపాతాన్ని చూడటం ఒక భిన్నమైన అనుభవం. మీరు ఆ అనుభూతిని ఆస్వాదించాలంటే యూరప్‌కు వెళ్లాల్సిందే. అక్కడ ప్రతిరోజు మంచు కురుస్తుంది. అలాంటి నగరాలు శీతాకాలంలో సందర్శంచడానికి బెస్ట్ అని చెప్పవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
1. ప్రాగ్ నగరం
ప్రాగ్ నగరం శీతాకాలంలో అద్భుతంగా కనిపిస్తుంది. అనేక కోటలు, రాజభవనాలకు నిలయం. చల్లటి వాతావరణంలో హాయిగా ఉండే కేఫ్‌లు మంచి విశ్రాంతిని అందిస్తాయి. ఒక కప్పు వేడి చాక్లెట్‌ని కూడా ఆస్వాదించవచ్చు.
2. స్టాక్‌హోమ్
మీరు అద్భుతమైన హిమపాతాన్ని ఆస్వాదించగల మరొక యూరోపియన్ గమ్యస్థానం స్టాక్‌హోమ్. ఇక్కడ మెట్రో ద్వారా యాక్సెస్ చేయగల స్కీ స్లోప్‌లను చూడవచ్చు. ఐస్ స్కేటింగ్‌తో సహా ఇతర శీతాకాలపు ఆటలలో పాల్గొనవచ్చు. రోజు చివరిలో విశ్రాంతి తీసుకోవడానికి ఆవిరి స్నానాలు చేయవచ్చు.
3. ఎడిన్‌బర్గ్
ఎడిన్‌బర్గ్ ఐరోపాలోని ఒక ప్రదేశం. ఇక్కడ మంచు ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. మంచు కురుస్తున్నప్పుడు ఈ స్కాటిష్ రాజధాని అందంగా ఉంటుంది. ఈ సమయంలో ఎడిన్‌బర్గ్ కోటను సందర్శిస్తే ఆ అనుభవాన్ని అస్సలు మరిచిపోలేరు.
4. హెల్సింకి
మీరు హిమపాతాన్ని అనుభవించడానికి యూరప్‌కు వెళ్లాలని నిశ్చయించుకుంటే హెల్సింకి కూడా మంచి ప్రదేశం. బాల్టిక్ సముద్రం మధ్యలో ఉన్న ఒక అందమైన నగరం. ఇక్కడి సంస్కృతి, చరిత్ర అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మంచు కురుస్తున్న సమయంలో ఒక కప్పు కాఫీ సిప్ చేస్తూ కాసేపు గడిపే అద్భుతమైన క్షణాలను ఆస్వాదించండి.
5. కోపెన్‌హాగన్
మీరు ప్రశాంతమైన నగరంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే డానిష్ రాజధానికి వెళ్లాల్సిందే. అక్కడి వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి ఒక్కసారి తింటే అస్సలు మరిచిపోరు. అయితే ఇక్కడికి వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రపంచంలో పేరుపొందిన రెస్టారెంట్లు ఇక్కడ ఉంటాయి.