IRCTC: హైదరాబాద్–శ్రీశైలం–యాదాద్రి దర్శనం.. 4 రోజుల అద్భుత టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే!
Spiritual Telangana Package: తెలంగాణలోని హైదరాబాద్, శ్రీశైలం, యాదాద్రి, సురేంద్రపురి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతాలను కవర్ చేసే 4 రోజుల 'Spiritual Telangana with Srisailam' టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. రూ.12,510 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలో ఏసీ వసతి, రవాణా, అల్పాహారం, డిన్నర్‌తో పాటు ప్రధాన దర్శనీయ ప్రదేశాల సందర్శన కూడా ఉంటుంది.

తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలను ఒకే ప్యాకేజీలో సందర్శించాలని భావించే భక్తులు, పర్యాటకులకు ఇది మంచి అవకాశం. హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక కట్టడాలు, ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియంలు, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు పలు ప్రముఖ ప్రదేశాలను కవర్ చేసే ‘Spiritual Telangana with Srisailam’ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ నాలుగు రోజుల రోడ్ టూర్‌లో సౌకర్యవంతమైన వసతి, రవాణా, అల్పాహారం, రాత్రి భోజనంతో పాటు ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనను ఏర్పాటు చేశారు.
టూర్ ముఖ్యాంశాలు
- వ్యవధి: 4 రోజులు – 3 రాత్రులు
- ప్రయాణ విధానం: రోడ్డు మార్గం
- అందుబాటు: ప్రతి రోజు (శుక్రవారం మినహా)
- భోజనం: 3 డిన్నర్లు, 2 బ్రేక్‌ఫాస్ట్‌లు
- వసతి: స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరీలు
టూర్ షెడ్యూల్
మొదటి రోజు – హైదరాబాద్ దర్శనం
హైదరాబాద్, సికింద్రాబాద్ లేదా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పికప్ అనంతరం హోటల్‌లో చెక్-ఇన్ చేస్తారు. అనంతరం చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్‌లను సందర్శించే అవకాశం ఉంటుంది. రాత్రికి హైదరాబాద్‌లోనే బస ఉంటుంది.
రెండో రోజు – శ్రీశైలం జ్యోతిర్లింగ దర్శనం
ఉదయం 5 గంటలకు శ్రీశైలం బయలుదేరుతారు. అక్కడ శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలను దర్శించుకుని సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస ఉంటుంది.
మూడో రోజు – హైదరాబాద్ ప్రముఖ ప్రదేశాలు
హోటల్‌లో అల్పాహారం అనంతరం బిర్లా మందిర్, గోల్కొండ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని దర్శించి సాయంత్రం హోటల్‌కు చేరుకుంటారు.
నాలుగో రోజు – యాదాద్రి దర్శనం
అల్పాహారం అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సురేంద్రపురిని సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుని రైల్వే స్టేషన్‌లో డ్రాప్‌తో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీలో లభించే సౌకర్యాలు
- హైదరాబాద్‌లో ఏసీ హోటల్ వసతి
- నిర్ణీత షెడ్యూల్ ప్రకారం బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్
- పూర్తి ఏసీ రోడ్డు రవాణా
- అన్ని ప్రధాన సందర్శనీయ ప్రదేశాల సందర్శన
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- వర్తించే పన్నులు
ప్యాకేజీలో లేని సేవలు
- మధ్యాహ్న భోజనం
- అదనపు ఆహారం
- రైలు, బస్సు, విమాన టికెట్లు
- దర్శనీయ ప్రదేశాల ప్రవేశ రుసుములు
- టూర్ గైడ్ సేవలు
- వ్యక్తిగత ఖర్చులు (టిప్స్, లాండ్రీ, మినరల్ వాటర్, ఫోన్ తదితరాలు)
వసతి వివరాలు
- స్టాండర్డ్ కేటగిరీ: కినారా గ్రాండ్, రాజ్ ఇన్ లేదా సమాన స్థాయి హోటళ్లు.
- కంఫర్ట్ కేటగిరీ: రాయల్ రీవ్, ఇన్నర్ సర్కిల్, గ్రాండ్ కాంటినెంట్, హాలిడే ఇన్ ఎక్స్‌ప్రెస్ లేదా సమాన స్థాయి హోటళ్లు.
ప్యాకేజీ ధరలు
ఈ ప్యాకేజీలో ఒకటి నుంచి ఆరుగురు వరకు ప్రయాణించే వారికి ప్రత్యేక ధరలు ఉన్నాయి. స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరీల్లో డబుల్, ట్రిపుల్ ఆక్యుపెన్సీతో పాటు పిల్లలకు కూడా వేర్వేరు చార్జీలు వర్తిస్తాయి. ధరలు ఒక్కో వ్యక్తికి సుమారు రూ.12,510 నుంచి రూ.24,440 వరకు ఉంటాయి. ప్రయాణికుల సంఖ్య, గది ఎంపిక ఆధారంగా ధర మారుతుంది.
ముఖ్య సూచనలు
- హోటల్ చెక్-ఇన్ సమయం మధ్యాహ్నం 12 గంటలు.
- ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
- సందర్శనీయ ప్రదేశాల సమయాలను బట్టి షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చు.
- మొదటి, చివరి రోజు సందర్శనలు రాకపోకల సమయాలపై ఆధారపడి ఉంటాయి.
- ప్రయాణానికి ముందు డ్రైవర్‌తో ప్రయాణ సమయాలను నిర్ధారించుకోవడం మంచిది.
హైదరాబాద్ చారిత్రక వైభవం, శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం, యాదాద్రి దివ్య దర్శనం, సురేంద్రపురి ఆధ్యాత్మిక అనుభూతిని ఒకే టూర్‌లో ఆస్వాదించాలనుకునే వారికి ఈ నాలుగు రోజుల ప్యాకేజీ ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు.




