AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: IRCTCకి ప్రధాన ఆదాయ వనరు ఏంటో మీకు తెలుసా?.. అదేంటో తెలిస్తే షాకవుతారు..

IRCTC Income Source: సుదూర రైలు ప్రయాణానికి తాగునీరు చాలా అవసరం. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. IRCTC 'రైల్ నీర్' పేరుతో తాగునీటిని విక్రయిస్తోంది. IRCTC ఈ తాగునీటి విక్రయం ద్వారా సంవత్సరానికి రూ. 31,456.73 లక్షలు ఆర్జిస్తుంది. ఇది వారి మొత్తం ఆదాయంలో 8.84 శాతం.

Indian Railways: IRCTCకి ప్రధాన ఆదాయ వనరు ఏంటో మీకు తెలుసా?.. అదేంటో తెలిస్తే షాకవుతారు..
Irctc
Sanjay Kasula
|

Updated on: Jun 23, 2023 | 7:49 PM

Share

దేశంలోని అధిక భాగం ప్రజలు ప్రయాణానికి భారతీయ రైల్వేపైనే ఆధారపడుతున్నారు. ప్రతిరోజు కొన్ని మిలియన్ల మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు. చాలా మంది ప్రయాణీకులు ఉన్నందున.. సహజంగా దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి వస్తుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లేదా ఐఆర్‌సీటీసీ అనేది రైలు సేవల నిర్వహణకు పాలకమండలి. సుదూర రైళ్లలో ఆహారం అందించడం నుంచి టికెటింగ్ సిస్టమ్ వరకు.. అన్ని సేవలను ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తుంది. ఐఆర్‌సీటీసీ ప్రతి సంవత్సరం ప్రయాణికుల నుంచి వేల కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. అయితే రైల్వేకి ప్రధాన ఆదాయ వనరు ఏంటో తెలుసా?

ఇటీవల రైల్వే ఆదాయ వనరుల కోసం అన్వేషించారు అధికారులు. ఈ సమాచారం ఐఆర్‌సీటీసీ  ఫైనాన్షియల్ రిపోర్ట్ లేదా ఫైనాన్షియల్ రిపోర్ట్ నుండి సేకరించబడింది. ఐఆర్‌సీటీసీ అతిపెద్ద ఆదాయం టికెటింగ్ లేదా టూరిజం సేవల నుండి కాదు, క్యాటరింగ్ సేవల నుండి అని నివేదించబడింది. ఐఆర్‌సీటీసీ  క్రింద బహుళ సేవలు ఉన్నాయి, అవి- టికెటింగ్ సిస్టమ్, క్యాటరింగ్, టూరిజం, రైల్ నీర్ జల్, రాజ్య తీర్థ.

  • ఐఆర్‌సీటీసీ అందించిన సమాచారం ప్రకారం, అత్యధిక ఆదాయం క్యాటరింగ్ ద్వారా, ఐఆర్‌సీటీసీ  డేటా ప్రకారం, వార్షిక ఆదాయం రూ.1,47,648.66 లక్షలు. ఇది ఐఆర్‌సీటీసీ మొత్తం ఆదాయంలో 41.51 శాతం.
  • ఆ తర్వాత ఇంటర్నెట్ టికెటింగ్ సేవలో ఆదాయం వస్తుంది. ఐఆర్‌సీటీసీ తత్కాల్, సాధారణ టిక్కెట్ల ద్వారా సంవత్సరానికి Tk  రూ. 1,19,803.42 లక్షలు సంపాదిస్తుంది. ఇది ఐఆర్‌సీటీసీ  మొత్తం ఆదాయంలో 33.69 శాతం.
  • తదుపరిది ఐఆర్‌సీటీసీ పర్యాటక సేవలు. ఐఆర్‌సీటీసీ తీర్థయాత్రల నుంచి మొదలు.. దేశంలోని వివిధ ఆసక్తికర ప్రదేశాలను చుట్టివచ్చే టూరిజం ప్యాకేజీ సేవలను ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం ఐఆర్‌సీటీసీ టూరిజం ద్వారా రూ. 41,220.59 లక్షలు సంపాదిస్తుంది. ఐఆర్‌సీటీసీ ఆదాయంలో 11.59 శాతం పర్యాటకం నుంచి వస్తుందని తాజా ఆర్ధిక నివేదికల్లో వెల్లడిచింది.
  • ప్రయాణికులకు తాగునీరు చాలా అవసరం. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఐఆర్‌సీటీసీ ‘రైల్ నీర్’ పేరుతో తాగునీటిని విక్రయిస్తోంది. ఐఆర్‌సీటీసీ ఈ తాగునీటి విక్రయం ద్వారా సంవత్సరానికి రూ. 31,456.73 లక్షలు ఆర్జిస్తుంది. ఇది వారి మొత్తం ఆదాయంలో 8.84 శాతం.
  • తీర్థాయాత్ర కూడా IRCTC నిర్వహిస్తుంది. IRCTC ఈ తీర్థయాత్ర సేవ ద్వారా సంవత్సరానికి 15,377.83 లక్షలు సంపాదిస్తుంది. మొత్తం ఆదాయంలో 4.32 శాతం రాష్ట్ర తీర్థయాత్రల ద్వారా వస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం