
Delhi Heritage Triangle Tour
దేశ రాజధాని ఢిల్లీ అందమైన పురాతన నగరం. ఇక్కడ ఎన్నో పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలున్నాయి. వీటి అందాలను వీక్షిచేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తారు. అయితే వేసవి సెలవుల్లో భాగ్యనగర వాసులు దేశ రాజధాని హస్తినలో పర్యటించాలనుకుంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా ఢిల్లీలోని పలు అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఐఆర్సీటీసీ టూరిజం శాఖ హెరిటేజ్ ట్రయాంగిల్ పేరుతో ఈ సూపర్ ప్యాకేజీ అందిస్తోంది.
పురాతన నగరం ఢిల్లీని తక్కువ ధరలో సందర్శించాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం సూపర్ ప్యాకేజీ తీసుకొచ్చింది.హెరిటేజ్ ట్రయాంగిల్ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ ద్వారా ఢిల్లీ చేరుకోవాలి. ఈ టూర్ లో ఏఏ ప్రదేశాలు చూడొచ్చు, ధర ఎంత, ప్రయాణ తేదీలు ఎప్పుడు తదితర వివరాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..
సూపర్ ప్యాకేజీ వివరాలు.. షెడ్యుల్
- ఈ టూర్ ఫస్ట్ డే ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి రైలు (ట్రైన్ నెం 12723) ను టూర్ జర్నీ స్టార్ట్ మొదలవుతుంది.. మొదటి రోజు మొత్తం ట్రైన్ ప్రయాణం ఉంటుంది.
- సెకండ్ డే; రెండో రోజు ఉదయం 8 గం. దేశరాజధానిలో అడుగు పెడతారు. ఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి హోటల్‌కు చేరుకుని చెకిన్ అవ్వాల్సి ఉంటుంది. హొటల లో చెకిన్ అయిన అనంతరం కాలకృత్యాలు తీర్చుకుని అల్పాహారం తీసుకోవాలి. తర్వాత ఢిల్లీలోని కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, అక్షరధామ్ వంటి ప్రదేశాలను సందర్శించాలి. నచ్చిన చోట షాపింగ్ కూడా చేయవచ్చు. తిరిగి రాత్రికి హోటల్ కు చేరుకుని హోటల్ డిన్నర్ ముగించి.. హోటల్ లోనే బస చేయాల్సి ఉంటుంది.
- థర్డ్ డే: మూడో రోజు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత హోటల్ చెక్ అవుట్ అయ్యి .. ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ వంటి ప్రదేశాలను సందర్శించాల్సి ఉంటుంది. తర్వాత తాజ్ మహల్ కొలువైన ఆగ్రాకు బయలుదేరుతారు. సాయంత్రానికి ఆగ్రా చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయ్యి.. రాత్రికి అగ్రలోనే బస చేయాల్సి ఉంటుంది.
- ఫోర్త్ డే: నాలుగో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిని.. తర్వాత తాజ్ మహల్ ను సందర్శించదానికి వెళ్ళాలి. తిరిగి హోటల్ కు చేరుకుని చెక్ అవుట్ లగేజ్ తీసుకుని ఆగ్రా ఫోర్ట్ ను సందర్శించడానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కృష్ణ జన్మ భూమి మథుర బయలుదేరుతారు. సాయంత్రం మథురలోని కృష్ణ జన్మభూమిని .. కన్నయ్య ఆలయాన్ని దర్శించుకోవాలి. రాత్రి మథురలోని హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది.
- ఫిఫ్త్ డే: మధురలో హోటల్లో చెక్ అవుట్ చేసి అక్కడ నుంచి రాధాకృష్ణల ప్రేమ మందిరం బృందావనం దర్శనం కోసంవెళ్తారు. బృందావనం నుంచి మధ్యాహ్నం తర్వాత మథుర జంక్షన్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవాలి. మధుర నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 5:30 గంటలకు ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ జర్నీ రాత్రంతా ఉంటుంది.
- ఆరో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ హెరిటేజ్ ట్రయాంగిల్ టూర్ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది.
టికెట్ ధరలు ..ఒకరు లేదా ముగ్గురు కలిసి వెళ్ళాలనుకుంటే..
స్టాండర్డ్ క్లాస్.. అంటే స్లీపర్ క్లాస్
- సింగిల్ షేరింగ్- రూ.39,270
- డబుల్ షేరింగ్-రూ.21,340
- ట్రిపుల్ షేరింగ్- రూ.16,340
- 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.11,850
- 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ అవుట్ బెడ్ రూ.10,540
కంఫర్ట్ క్లాస్ అంటే థర్డ్ ఏసీ
- సింగిల్ షేరింగ్- రూ.42,350
- డబుల్ షేరింగ్- రూ.24,420
- ట్రిపుల్ షేరింగ్-రూ.19,430
- 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ రూ.14,940
- 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ అవుట్ బెడ్ రూ.13,630
నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణికులు బృందంగా వెళ్ళాలనుకుంటే
స్లీపర్ క్లాస్ టికెట్స్ ధర
- డబుల్ షేరింగ్- రూ.17,600
- ట్రిపుల్ షేరింగ్-రూ.14,950
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్- రూ.11,850
- విత్ అవుట్ బెడ్ – రూ.10,540
థర్డ్ ఏసీలో ప్రయాణం చేయాలనుకుంటే టికెట్స్ ధరలు
- డబుల్ షేరింగ్ -రూ.20,690,
- ట్రిపుల్ షేరింగ్-రూ.18,040
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ -రూ.14,940
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ అవుట్ బెడ్- రూ.13,630
ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు
- హైదరాబాద్ నుంచి ఢిల్లీ.. ఆగ్రా, మధుర.. బృందావనం, మధుర నుచి విజయవాడ ప్రయాణించే ట్రైన్ టికెట్లు
- హోటల్ లో బస
- మూడు రోజులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లు
- లోకల్ ప్లేస్‌లు చూసేందుకు వెహికల్
- జీవిత భీమా సౌకర్యం
ఈ టూర్ ప్యాకేజీ మార్చి 24వ తేదీన అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాలతో పాటు ఈ టూర్ బుకింగ్ కోసం IRCTC ప్యాకేజీ లింక్‌పై క్లిక్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..