AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఈ చిన్న ట్రిక్‌ తెలిస్తే.. తక్కువ ధరకే బిజినెస్‌ క్లాస్‌లో వెల్లొచ్చు..

విమాన ప్రయాణాల్లో బిజినెస్ క్లాస్ అంటే కేవలం సెలబ్రిటీలకో, పారిశ్రామికవేత్తలకో మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు సామాన్యులు కూడా భారీ డిస్కౌంట్లతో లగ్జరీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అవును మీకు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే తక్కువ ధరకే బిజినెస్ క్లాస్‌లో విదేశీ ట్రిప్‌కు మీరు వెళ్లొచ్చు. అదెలానో తెలుసుకోవాలంలే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.

విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఈ చిన్న ట్రిక్‌ తెలిస్తే.. తక్కువ ధరకే బిజినెస్‌ క్లాస్‌లో వెల్లొచ్చు..
Cheap Business Class Tickets
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 08, 2026 | 11:41 AM

Share

విమాన ప్రయాణం అనగానే మనకు గుర్తొచ్చేది ఎకానమీ క్లాస్. గంటల తరబడి ఇరుకైన సీట్లలో కూర్చుని ప్రయాణించడం అంటే ఎవరికైనా విసుగే. కానీ బిజినెస్ క్లాస్ ధరలు చూస్తే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తాయి. అయితే, ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న ఏవియేషన్ అనలిస్ట్ కాలేబ్ మోరిసన్ చెప్పే విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. బిజినెస్ క్లాస్ టికెట్లపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్ పొందడం సాధ్యమేనని ఆయన నిరూపించారు. టెక్నాలజీ సాయంతో సరైన పద్ధతిలో వెతికితే, భారీ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని ఆయన వివరిస్తున్నారు.

సాధారణంగా ఎయిర్‌లైన్స్ తమ బిజినెస్ క్లాస్ సీట్లను త్వరగా నింపుకోవడానికి ‘ఫ్లాష్ సేల్స్’ నిర్వహిస్తుంటాయి. ఇవి చాలా తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉంటాయి. మనం వెతికేలోపే అవి మాయమైపోతుంటాయి. మరికొన్ని సార్లు భారీ డిస్కౌంట్లు ఉన్నా, ఎయిర్‌లైన్స్ వాటిని బహిరంగంగా ప్రకటించవు. కేవలం డిమాండ్‌ను పరీక్షించడానికి మాత్రమే ధరలు తగ్గిస్తాయి. ఇలాంటి డీల్స్ పట్టుకోవడం సాధారణ ప్రయాణికులకు దాదాపు అసాధ్యం. గూగుల్ ఫ్లైట్స్ లేదా స్కై స్కానర్ వంటి సైట్లలో కూడా ఇవి ఎప్పుడూ కనిపించవు.

కాలేబ్ మోరిసన్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, చికాగో నుండి పారిస్ వెళ్లే బిజినెస్ క్లాస్ టికెట్‌ను కేవలం 600 డాలర్లకే (సుమారు ₹53,000) పొందానని చెప్పారు. సాధారణంగా దీని ధర 2,000 డాలర్ల పైమాటే ఉంటుంది. ఇలాంటి డీల్స్ కోసం ఆయన ‘రేట్‌పంక్’ (RatePunk) వంటి ఆధునిక ఏఐ టూల్స్ వాడాలని సూచిస్తున్నారు. ఈ టూల్స్ వేల సంఖ్యలో ఉన్న ఎయిర్‌లైన్ వెబ్‌సైట్లను నిరంతరం స్కాన్ చేస్తూ, ఎక్కడ ధర తగ్గినా వెంటనే మనకు అలర్ట్ పంపిస్తాయి. తద్వారా తక్కువ ధరకే విలాసవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.

మరిన్ని టూరిజం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us