Viral Video: భారత్ యాత్రలో ఆస్ట్రేలియా టూరిస్ట్‌ను ఆశ్చర్యపరిచిన 3 విషయాలు..!

భారత్‌లో ప్రయాణించిన ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆమె ప్రయాణంలో అద్భుతమైన అనుభవాలను పొందిందని చెబుతోంది. మహిళల భద్రత, భారతీయ భోజనం, చారిత్రక ప్రదేశాలు గురించి ఆమె చెప్పిన మూడు విషయాలు చాలా మందిని ఆకర్షించాయి.

Viral Video: భారత్ యాత్రలో ఆస్ట్రేలియా టూరిస్ట్‌ను ఆశ్చర్యపరిచిన 3 విషయాలు..!
Australian Tourist

Edited By:

Updated on: Mar 07, 2025 | 12:34 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతుంది. భారత్‌ యాత్రలో ఆశ్చర్యపరిచిన మూడు విషయాల గురించి ఆస్ట్రేలియన్ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ఆస్ట్రేలియా మహిళ బెక్ మెక్‌కోల్ తన ఒంటరి ప్రయాణ అనుభవాన్ని పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ భారత్‌లో యాత్ర చేసిన అనుభవం తన జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనల్లో ఒకటిగా చెప్పింది. మెక్‌కోల్ చెప్పిన మూడు ఆశ్చర్యపరిచిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మెక్‌కోల్ మాట్లాడుతూ రాత్రిపూట బయట ఉన్నప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపించినప్పటికీ ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని చెప్పింది. ఈ వీడియోలో ఆమె ఆటో రిక్షాలో రోడ్లపై ప్రయాణించడం, స్థానికులను కలవడం, చారిత్రక ప్రదేశాలను సందర్శించడం చూపిస్తుంది.

ఆమెను ఆశ్చర్యపరిచిన మరో విషయం భోజనం. “భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని భయపడ్డాను. కానీ అదేవీ జరగలేదు. భోజనం చాలా రుచిగా ఉంది. ముఖ్యంగా వెజిటేరియన్ వంటకాలు. ముందుగా చెప్పినంత మసాలా కూడా లేదు. చివరికి అయితే నేను మసాలా కోసం ఎదురుచూసేదానిని” అని మెక్‌కోల్ వీడియోలో చెప్పింది.

మెక్‌కోల్‌ని అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం భారతదేశ చరిత్ర. “భారతదేశంలో ఎంతటి చరిత్ర ఉందో నాకు అస్సలు తెలియదు. 13వ శతాబ్దానికి చెందిన పురాతన నగరాలు, యునెస్కో ప్రదేశాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. సాంస్కృతిక పౌరాణికత నాకు ఆశ్చర్యం కలిగించింది” అని చెప్పింది.

తన వీడియో చివర్లో మెక్‌కోల్ భారత్‌లో చేసిన ప్రయాణం గురించి ఇతర ప్రయాణికులకు ఒక సందేశం ఇచ్చింది. “భారత్ గురించి వదంతులు విన్నట్టుగా ఏమీ లేదని నాకు అనిపించింది. ఇక్కడి ప్రయాణం సురక్షితం, భోజనం రుచికరం, చరిత్ర అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ప్రయాణం కోసం ఇంకేమి కావాలి..? అని ఆమె చెప్పింది.”

మెక్‌కోల్ చెప్పిన మూడు విషయాలు ఇవే

  • మహిళల భద్రత
  • భారతీయ భోజనం
  • భారతదేశ చరిత్ర

ఈ వీడియోను సోషల్ మీడియాలో 1,50,000 మందికి పైగా వీక్షించారు. మెక్‌కోల్ తన అనుభవాన్ని వీడియో ద్వారా అందంగా తెలియజేసిన విధానం సోషల్ మీడియా నెటిజన్లను ఆకట్టుకుంది.