Varanasi Trip: కాశికి వెళ్తున్నారా.. సమీపంలో అందమైన జలపాతాలపై ఓ లుక్ వేయండి..

|

Sep 28, 2024 | 7:59 PM

హిందువులు కాశి లేదా వారణాసి నగరాన్ని ఒకసారి సందర్శించాలని కోరుకుంటారు. విశ్వేశ్వరుడిని దర్శనం, గంగా తీరంలో స్నానం ఇవన్నీ మనసు ప్రశాంతతని ఇస్తాయి. ఈ నేపధ్యంలో ఎవరైనా కాశికి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే.. లేదా ఇక్కడ నివసించబోతున్నా సమీపంలోని పచ్చదనంతో పాటు అందమైన జలపాతాలు మొదలైన వాటిని చూడగలిగే ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Varanasi Trip: కాశికి వెళ్తున్నారా.. సమీపంలో అందమైన జలపాతాలపై ఓ లుక్ వేయండి..
Varanasi Trip
Follow us on

హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం వారణాసి.. గంగా నదీ తీరంలో వెలసిన అతి పురాతన నగరంలో ఆడుగడుగునా ఓ గుడి ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణంతో మనసు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది. ఈ క్షేత్రంలో గంగానదీ స్నానం. గంగా ఘాట్‌లో సాయంత్రం హారతి, కాశీ విశ్వనాథ ఆలయం, ఆధ్యాత్మిక ప్రశాంతత వంటి వాటితో కాశీ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడే ప్రదేశంగా మారిపోయింది. వారణాసి స్వతహాగా చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు దీని చుట్టూ పచ్చదనంతో నిండిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. హిల్ స్టేషన్ అంటే ఇష్టమైన వారు ఈ ప్రదేశాలకు విహారయాత్రగా వెళ్లేందుకు ప్లాన్ చేయవచ్చు. మీరు వారణాసిని సందర్శిస్తున్నట్లయితే.. సమీపంలోని ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్రదేశాలన్నీ కాశి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరంలో ఉన్నాయి. కనుక ఈ ప్రదేశాలకు 2 నుంచి 3 గంటల లోపు ప్రయాణించి ఆ పర్యాటక ప్రదేశాలను సులభంగా చేరుకోవచ్చు.

హిందువులు కాశి లేదా వారణాసి నగరాన్ని ఒకసారి సందర్శించాలని కోరుకుంటారు. విశ్వేశ్వరుడిని దర్శనం, గంగా తీరంలో స్నానం ఇవన్నీ మనసు ప్రశాంతతని ఇస్తాయి. ఈ నేపధ్యంలో ఎవరైనా కాశికి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే.. లేదా ఇక్కడ నివసించబోతున్నా సమీపంలోని పచ్చదనంతో పాటు అందమైన జలపాతాలు మొదలైన వాటిని చూడగలిగే ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

లఖనియా హిల్స్- వాటర్ ఫాల్స్
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఒక అందమైన జలపాతం ఇది. బనారస్ నుండి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని లఖానియా దరి జలపాతం అని పిలుస్తారు. దాదాపు 150 మీటర్ల ఎత్తైన కొండ నుంచి చెరువులోకి జారుతున్న ఈ జలపాతం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళడం ఎవరికైనా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

రాజదారి జలపాతం
వారణాసి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందౌలీ జిల్లాలో ఉన్న రాజదారి జలపాతాన్ని సందర్శించవచ్చు. ఇది అత్యంత ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్‌లలో ఒకటి. కుటుంబం, స్నేహితుల కోసం ఇక్కడ చిన్న ట్రిప్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. పచ్చదనం మధ్య వారాంతాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ఇక్కడ బ్యాడ్మింటన్ మొదలైన ఆటలు కూడా ఆడవచ్చు.

దేవదారి జలపాతం
చందౌలీలో ఉన్న దేవదారి జలపాతాన్ని సందర్శించవచ్చు. నిజానికి ఈ రెండు జలపాతాలు చంద్రప్రభ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్నాయి. ఈ ప్రదేశం అందంగా ఉండటమే కాకుండా అనేక రకాల అడవి జంతువులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. సహజ దృశ్యాలను చూడాలనుకుంటే ఇక్కడ ఒక రోజు పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బస చేయడానికి మంచి హోటల్స్ దొరకకపోవచ్చు. అయితే ఇక్కడ ప్రకృతి మధ్య సమయాన్ని గడపవచ్చు. వారణాసి నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో వారాంతపు యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

తాండ పతనం
వారణాసి నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండా గ్రామంలో సహజసిద్ధమైన జలపాతం ఉంది. ఇది ఈ ప్రాంతంలోని అత్యంత అందమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. స్థానిక ప్రజలను అలాగే పర్యాటకులను ఆకర్షిస్తుంది. జలపాతం నుంచి ప్రవహించే నీటి ప్రవాహం, నది, ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనం ఎవరినైనా ఆహ్లాదపరుస్తాయి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..