హెయిర్‌ డై లేకుండానే జుట్టును నల్లగా మార్చే అద్భుత చిట్కా.. దీన్ని ఆవాల నూనెతో కలిపి వాడితే చాలు..

|

Oct 02, 2023 | 9:27 AM

మస్టర్డ్ ఆయిల్ జుట్టుకు మంచిది. ఇందులో ఉండే పదార్థాలు జుట్టును నల్లగా, ఒత్తుగా, పొడవుగా, దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. పూర్వకాలంలో కూడా మన అమ్మమ్మలు, తాతలు ఈ నూనెను జుట్టుకు రాసేవారు. ఈ నూనెతో కలిపి కొన్ని రెసిపీస్‌ని తయారు చేసి వాడితే మీ జుట్టుకు మరింత మేలు చేస్తుంది. ఎందుకంటే.. ఆవనూనె

హెయిర్‌ డై లేకుండానే జుట్టును నల్లగా మార్చే అద్భుత చిట్కా.. దీన్ని ఆవాల నూనెతో కలిపి వాడితే చాలు..
Mustard Oil
Follow us on

ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లలు కూడా తెల్లజుట్టు సమస్యతో సతమతమవుతున్నారు. ఒకప్పుడు జుట్టు నెరిసిపోవడం అనేది వృద్ధాప్యానికి సంకేతం.. అయితే ఈరోజుల్లో ప్రజల జీవనశైలి, ఆహారపుటలవాట్ల వల్ల జుట్టు వేగంగా నెరసిపోతుంది. వాటిని దాచుకోవడానికి ఎన్నో రకాల హెయిర్ డైలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. అయితే వీటిని అప్లై చేయడం వల్ల జుట్టు పాడవుతుందనేది కూడా నిజం. ఎందుకంటే ఇందులో వాడే రసాయనాల వల్ల జుట్టుతోపాటు ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. హెయిర్ కలర్ , డైలలో ఉండే కెమికల్స్ వల్ల చాలా మంది మార్కెట్ లో దొరికే హెయిర్ కలర్ ని వాడరు . మీరు కూడా తెల్లజుట్టుతో బాధపడుతూ, సహజంగా నల్లగా మార్చుకోవాలనుకుంటే మీకు ఇలాంటి హోంమేడ్‌ రెమిడీని ప్రయత్నించవచ్చు.. ఇది మీకు ఉపయోగపడుతుంది.

మస్టర్డ్ ఆయిల్ జుట్టుకు మంచిది. ఇందులో ఉండే పదార్థాలు జుట్టును నల్లగా, ఒత్తుగా, పొడవుగా, దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. పూర్వకాలంలో కూడా మన అమ్మమ్మలు, తాతలు ఈ నూనెను జుట్టుకు రాసేవారు. ఈ నూనెతో కలిపి కొన్ని రెసిపీస్‌ని ఎలా తయారు చేసి వాడితే మీ జుట్టుకు మరింత మేలు చేస్తుంది. ఎందుకంటే.. ఆవనూనె చాలా ప్రభావవంతమైనది. ఇది మీ జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో, జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఆవనూనెతో కలిపి మరికొన్ని పదార్థాలను జుట్టుకు వాడటం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది.. ఈ నూనెను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

ఈ నూనెను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకోవాలి. అందులో ఒక కలబంద ఆకు, ఒక గుప్పెడు కరివేపాకు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 టీస్పూన్ కలోంజీ సీడ్స్‌ని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇక దీని తయారీ కోసం ఒక ఇనుప పాత్రలో ఆవాల నూనెను ముందుగా వేడి చేయాలి. ఆ తర్వాత అందులో పై పేర్కొన్న అన్ని పదార్థాలను కలపండి. ఈ మిశ్రమాన్ని 10-15 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత ఇనుప పాత్రలో వేసి చల్లార్చాలి. చల్లారిన తర్వాత నూనెను వడకట్టి మరో సీసాలో నిల్వచేసుకోవాలి.

ఇప్పుడు ఈ నూనెను జుట్టు మూలాలకు, తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. జుట్టు మూలాల నుండి చివర వరకు బాగా అప్లై చేయాలి. అవసరమైతే రాత్రిపూట నూనె రాసుకుని ఉదయాన్నే తలస్నానం చేయాలి. లేదంటే నూనె అప్లై చేసుకున్న 2 గంటల తర్వాత కూడా జుట్టు కడిగేసుకోవచ్చు.

ఈ నూనెను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు జుట్టును నల్లగా, మందంగా, బలంగా మార్చడానికి సహాయపడతాయి. ఉత్తమ ఫలితాల కోసం, ఈ నూనెను వారానికి రెండుసార్లు జుట్టుకు రాయండి. మీరు కొన్ని రోజుల్లో ప్రభావాన్నిచూస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..