శరీరంలో ముఖ్యమైన భాగాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ రోజులు బ్రతకగలం. ఈ బిజీ బిజీ లైఫ్‌లో జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా ఊపిరి తిత్తులు అనేవి పాడైపోతున్నాయి. లంగ్స్ పాడవడంతో ఇతర అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఊపిరి తిత్తులు హెల్దీగా ఉండాలంటే.. కొన్ని రకాల పద్దతులు ఖచ్చితంగా పాటించాలి. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు కొన్ని రకాల బ్రీతింగ్ పద్దతులు కూడా తరచూ చేస్తూ ఉండాలి. దీని వల్ల ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
డీప్ బ్రీతింగ్ అనేది శక్తి వంతమైన, అద్భుతమైన వ్యాయామ పద్ధతి. ఈ బ్రీతింగ్ చేయాలంటే నిటారుగా కూర్చుకోవాలి. భుజాలను వదులుగా ఉంచుకోవాలి. నెమ్మది నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ.. పొట్ట పైకి వచ్చేలా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత నెమ్మ నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఇలా రోజుకు కనీసం పది సార్లైనా చేయడం వల్ల ఊపిరి తిత్తులు అనేవి బలంగా తయారవుతాయి.
నాసికా రంధ్రాలతో శ్వాస పీల్చుకుని నెమ్మదిగా వదులుతూ ఉండాలి. మధ్య వేలుతో కుడి నాసికను మూసి.. రెండో రంధ్రంతో డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలాగే ఎడమవైపు నాసికను మూసి.. కుడివైపు నాసికా రంధ్రంతో శ్వాస పీల్చుకోవాలి. ఇలా రోజుకు ఐదు నుంచి పది సార్లు చేయాలి.
ఈ పద్దతిలో ముక్కుతో డీప్ బ్రీత్ తీసుకోవాలి. నోటి నిండా గాలితో నింపాలి. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కూర్చుని గాలిని వదులుతూ ఉండాలి. ఇలా రోజుకు ఐదు సార్లు అయినా చేయాలి. ఇలా చేసినా కూడా ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మీ ముఖం కూడా కాంతి వంతంగా తయారవుతుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.
ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పద్దతి కూడా బాగా ఉపయోగ పడుతుంది. అదే మెట్లు ఎక్కడం. మెట్లు ఎక్కేటప్పుడు లోతుగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత దిగేటప్పుడు శ్వాసను నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఇలా రోజూ చేయాలి. ఇలా కనీసం ఐదు నుంచి పది సార్లైనా చేయవచ్చు. ఇలాంటి పద్దతులు పాటించడం వల్ల ఊపిరి తిత్తులు అనేవి బలంగా, ఆరోగ్యంగా మారతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.