Kitchen tips: ఎండు కొబ్బరి త్వరగా బూజు పడుతోందా.? ఇలా చేసి చూడండి..

మార్కెట్‌ను నుంచి తెచ్చిన వెంటనే ఎండు కొబ్బరిని ముందుగా మంచి గుడ్డతో నీట్‌గా తుడుచుకోవాలి. అనంతరం కాసేపు ఎండలో ఆరబెట్టాలి. అనంతరం కొబ్బరి చిప్పలను ఉప్పు నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని ఎండు కొబ్బరి చిప్పలకు రాయాలి. చివరిగా కొబ్బరి నూనె పూసిన చిప్పలను కాసేపు ఎండలో పెట్టి కవర్‌లో మూత కట్టాలి. ఈ మూటను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. ఇలా చేస్తే నెలలు గడిచినా ఎండు కొబ్బరి తాజాగా నిల్వ ఉంటుంది...

Kitchen tips: ఎండు కొబ్బరి త్వరగా బూజు పడుతోందా.? ఇలా చేసి చూడండి..
How To Store Dry Coconut

Updated on: Jul 31, 2023 | 7:41 AM

ఎండుకొబ్బరిని నిల్వ ఉంచడం అంత సులభమైన విషయం కాదు. మార్కె్‌ట్‌ నుంచి తెచ్చిన కొన్ని రోజులకే బూజుపట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తేమ కారణంగా ఇలాంటి మార్పు కనిస్తుంది. ఇక కొన్నిసార్లు కొబ్బరి లోపల తెలుపు రంగులో కనిపించినా రుచి మాత్రం మారుతుంది. ఎండుకొబ్బరి చేదుగా మారుతుంది. అయితే కొన్ని రకాల టిప్స్‌ పాటించడం ద్వారా ఎండు కొబ్బరిని ఎంతకాలమైనా తాజాగా నిల్వ చేసుకోవచ్చు. ఇంతకీ ఎండు కొబ్బరి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎలాంటి టిప్స్‌ పాటించాలో ఇప్పుడు చూద్దాం..

మార్కెట్‌ను నుంచి తెచ్చిన వెంటనే ఎండు కొబ్బరిని ముందుగా మంచి గుడ్డతో నీట్‌గా తుడుచుకోవాలి. అనంతరం కాసేపు ఎండలో ఆరబెట్టాలి. అనంతరం కొబ్బరి చిప్పలను ఉప్పు నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని ఎండు కొబ్బరి చిప్పలకు రాయాలి. చివరిగా కొబ్బరి నూనె పూసిన చిప్పలను కాసేపు ఎండలో పెట్టి కవర్‌లో మూత కట్టాలి. ఈ మూటను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. ఇలా చేస్తే నెలలు గడిచినా ఎండు కొబ్బరి తాజాగా నిల్వ ఉంటుంది.

ఇక ఎండు కొబ్బరిని తాజాగా ఉంచడానికి మరో విధానం కూడా అందుబాటులో ఉంది. ఇందుకోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్‌ పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక మొత్తం కరిగిన తర్వాత, ఆ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపల, బయట తుడవాలి. ఇలా తుడిచిన చిప్పలను ఎండలో రెండు రోజుల పాటు ఆరబెట్టాలి. అనంతరం వాటిని ఒక కవర్‌లో మూటగట్టాలి. చివరిగా మూటను గాలి వెళ్లని డబ్బాలో నిల్వ చేయాలి. ఇలా చేస్తే కొబ్బరి చిప్పలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..