రక్తాన్ని శుద్ధి చేసి ఇన్ఫెక్షన్లను తరిమికొడుతుంది.. ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుత కషాయం..
తిప్పతీగను ఆయుర్వేదంలో ‘అమృత’గా పిలుస్తారు. ఇందులోని పలు సహజ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగ ముక్కలను నీటిలో మరిగించి తయారు చేసే కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎవరు జాగ్రత్తగా తీసుకోవాలి? తెలుసుకుందాం.

మారుతున్న కాలగుణాలు, కాలుష్యం, ఇన్ఫెక్షన్ల వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు, శరీరంలో ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుతమైన సహజ మూలిక తిప్పతీగ (Tippateega / Giloy).. అని ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. ఆయుర్వేదంలో దీనిని ‘అమృత’ అని పిలుస్తారు, అంటే మరణం లేనిది లేదా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేదని అర్థం.. వాస్తవానికి తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్స్, గ్లూకోసైడ్లు, టానిన్లు, ఐరన్, జింక్, కాపర్, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే.. తిప్పతీగ అనేక ఆరోగ్య సమస్యలకు అద్భుతమైన ఔషధమని పేర్కొంటున్నారు.
తిప్పతీగ కషాయం ముఖ్య ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Booster):
తిప్పతీగ కషాయం రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో తెల్ల రక్తకణాలు (WBC) వృద్ధి చెంది, వ్యాధి నిరోధక వ్యవస్థ అత్యంత బలంగా తయారవుతుంది.
ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ:
తరచూ వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
జ్వరాల నివారిణి:
వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా లేదా తీవ్రమైన పాత జ్వరాలు ఉన్నప్పుడు తిప్పతీగ కషాయం తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య మెరుగుపడుతుంది.
రక్త శుద్ధి – టాక్సిన్ల తొలగింపు:
ఈ కషాయం రక్తంలోని వ్యర్థాలను, విష పదార్థాలను (Toxic Waste) బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల:
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
తిప్పతీగ కషాయం తయారుచేసే విధానం:
కావలసినవి: బెరడు/ఆకులతో కూడిన లేత తిప్పతీగ ముక్కలు (సుమారు 2-3 అంగుళాలు), నీళ్లు..
తిప్పతీగ కాషాయం తయారీ:
ముందుగా తిప్పతీగ ముక్కలను కాస్త కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోసి, దంచిన తిప్పతీగను అందులో వేసి చిన్న మంటపై బాగా మరగబెట్టాలి.
ఆ నీరు సగం లేదా ఒక గ్లాసు వరకు అయ్యేంత వరకు మరిగించి దించుకోవాలి.
కషాయాన్ని వడకట్టుకుని, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి (రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు).
గమనిక: ఈ కషాయాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవడం వల్ల గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా మందులు వాడుతున్న వారు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం శ్రేయస్కరమని ఆయర్వేద నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
