మహిళలు బీ అలర్ట్‌.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదట !

థైరాయిడ్‌ గ్రంధిలో అసమతుల్యత వల్ల హైపో లేదా హైపర్ థైరాయిడిజం వస్తుంది. అలసట, బరువు మార్పులు, ఋతుక్రమ సమస్యలు, మూడ్ స్వింగ్స్, చర్మం పొడిబారడం, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు కూడా సూచన కావచ్చు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

మహిళలు బీ అలర్ట్‌.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదట !
Thyroid Symptoms

Updated on: Nov 25, 2025 | 1:30 PM

థైరాయిడ్‌ గ్రంధిలో అసమతుల్యత కారణంగా, హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. హైపోథైరాయిడిజంతో బాధపడేవారిలో అలసట ఎక్కువగా ఉంటుంది. చిన్నపనికే బాగా అలసిపోతారు. కొన్నిసార్లు ఎటువంటి పని చేయకుండానే అలసిపోయిన ఫీల్‌ వస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి ఓవర్‌గా పని చేయడం వల్ల బరువులో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఎక్కువగా తినకపోయినప్పటికీ వేగంగా బరువు పెరుగుతారు. హైపోథైరాయిడిజంతో ఇబ్బంది పడేవారు ఇతరుల కంటే ఎక్కువ చలిని అనుభవిస్తారు. మీలో లక్షణం కన్పిస్తే థైరాయిడ్‌ టెస్ట్ చేసుకోండి.

థైరాయిడ్‌ సమస్యలు ఉన్నప్పుడు హర్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల పీరియడ్స్‌ సమయానికి రావు. పీరియడ్స్‌లో రక్తస్రావం కూడా ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్‌ ఉన్న మహిళల్లో మూడ్‌ స్వింగ్స్‌ ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల మూడ్‌ స్వింగ్స్‌ వస్తాయి. చిరాకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మెంటల్ ఫాగ్‌ వచ్చే అవకాశం ఉంది. ఏకాగ్రత దెబ్బతింటుంది.

థైరాయిడ్‌తో బాధపడుతున్న వ్యక్తుల్లో గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. హైపర్ థైరాయిడిజం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. థైరాయిడ్‌ వల్ల మహిళల్లో చర్మ సమస్యలు కూడా వస్తాయి. మీలో ఎటువంటి కారణం లేకుండా చర్మం పొడిబారుతుంటే థైరాయిడ్‌ అని అనుమానించండి. థైరాయిడ్‌ గ్రంథి సరిగా పని చేయకపోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. మలబద్దకం తీవ్రం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..