
మారుతున్న జీవీనశైలి, ఆహార అలవాట్ల కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు ప్రజలకు వేధిస్తున్నాయి. ముఖ్యంగా కాలుష్యం కారణంగా పురుషుల్లో బట్టతల సమస్య తీవ్రంగా ఉంది. పెరిగిన కాలుష్యంతో పాటు ఉద్యోగ ఒత్తిడి వల్ల పురుషులు ఎక్కువగా జుట్టు రాలడాన్ని అనుభవిస్తున్నారు. అయితే జుట్టు రాలడానికి చాలా కారణాలున్నా ఆహార అలవాట్లు కూడా కీలకపాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ సోడా, హెల్త్ డ్రింక్, వేడి, చల్లని పానీయాల్లో ఉండే చక్కెర జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. బయట తాగే వాటిల్లో మొక్కజొన్న సిరప్, మాల్టోస్, సుక్రోజ్ వంటి వివిధ రకాల చక్కెరలను కంపోజ్ చేస్తాయి. చక్కెర తీపి పానీయాల వినియోగం ఊబకాయం, గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధి, దంతాల కావిటీస్ వంటి వివిధ ఆరోగ్య రుగ్మతలతో జుట్టు రాలడాన్ని కూడా పెంపొందిస్తుంది. కాబట్టి జుట్టు సంరక్షణకు వైద్యులు తెలిసే సలహాలను ఓ సారి తెలుసుకుందాం.
చక్కెరను అధికంగా తీసుకోవడం అనేది పురుషుల్లో జుట్టు రాలడానికి ప్రోత్సహిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. అధిక చక్కెర రక్త ప్రసరణను బలహీనపరుస్తుంది. దీంతో హెయిర్ ఫోలికల్స్ ఉత్తేజపరచడంలో విఫలమవుతాయి. అలాగే హెయిర్ ఫోలికల్స్ అవసరమైన పోషకాలను కోల్పోతాయి. ఇది బలహీనమైన జుట్టు మూలాలకు దారితీస్తుంది. ఆహారంలో అధిక చక్కెర స్కాల్ప్ మంటకు దారితీస్తుంది. దీని కారణంగా నెత్తిమీద ఉష్ణోగ్రత కొంత కాలానికి జుట్టు నష్టంతో పాటు బట్టతల వచ్చే అవకాశాన్ని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి పోషకాహార నిపుణులు జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారిని కొన్నిఆహార నియమాలు పేర్కొంటున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..