
చాలా మంది లేడీస్.. ముఖానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మెడకు ఇవ్వరు. దీంతో ముఖం మెరిసిపోయినా.. మెడ మాత్రం నల్లగా ఉంటుంది. దీని వల్ల మీరు ఎంతలా రెడీ అయినా. అందంగా కనిపించరు. ముఖం, మెడ ఒకేలా ఉండాలంటే.. రెండింటికీ ఒకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు రాసుకునే క్రీములు.. మెడకు కూడా రాసుకోవాలి. అయితే మెడ నలుపు కలర్ మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. హార్మోన్ల మార్పుల వల్ల, బరువు, ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మెడ భాగం నల్లగా మారుతుంది. కానీ ఇది ఆడవాళ్ల అందాన్ని పాడు చేస్తుంది. మరి ఈ మెడ నలుపును పోగొట్టుకోవాలంటే ఈ చిట్కాలు మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి.
కొబ్బరి నూనెతో మెడ నలుపును తగ్గించుకోవచ్చు. చాలా మంది కొబ్బరి నూనె వాడటం వల్ల నలుపు అవుతారు అనుకుంటారు. కానీ కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి.. మెడ భాగంలో అప్లూ చేసి.. చేతి వేళ్లతో సున్నితంగా మర్దనా చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే.. మెడ నలుపు రంగు తగ్గుతుంది.
పెరుగు, చింత పండుతో కూడా మెడ నలుపును తగ్గించుకోవచ్చు. చింత పండును వేడి నీటిలో ముందుగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గుజ్జు తీసి.. ఒక టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని మెడ నలుపు భాగంలో రాసి.. మెల్లగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మెడ నలుపు క్రమంగా తగ్గుతుంది.
కలబంద కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కలబంద గుజ్జులో పాలు, పంచదార కలిపి నలుపు ఉన్న ప్రదేశంలో స్క్రబ్ చేయండి. ఇది ఆరినతర్వాత నీటితో కడిగేసుకోవాలి.
అలాగే ఈ చిట్కా కూడా మెడ నలుపును తగ్గించడంలో బాగా సహాయ పడుతుంది. కొద్దిగా కొబ్బరి నూనెలో నిమ్మ రసం చుక్కలు, కొద్దిగా బేకింగ్ సోడాను వేసి లైట్‌గా స్క్రబ్ చేయాలి. ఇలా తరచూ చేస్తే మెడ నలుపు తగ్గుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)