AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark Neck: మెడ నలుపుతో ఇబ్బందిగా ఉందా.. ఈ బెస్ట్ చిట్కాలు మీకోసమే!

చాలా మంది లేడీస్.. ముఖానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మెడకు ఇవ్వరు. దీంతో ముఖం మెరిసిపోయినా.. మెడ మాత్రం నల్లగా ఉంటుంది. దీని వల్ల మీరు ఎంతలా రెడీ అయినా. అందంగా కనిపించరు. ముఖం, మెడ ఒకేలా ఉండాలంటే.. రెండింటికీ ఒకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు రాసుకునే క్రీములు.. మెడకు కూడా రాసుకోవాలి. అయితే మెడ నలుపు కలర్ మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. హార్మోన్ల మార్పుల వల్ల, బరువు, ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మెడ భాగం నల్లగా మారుతుంది. కానీ ఇది ఆడవాళ్ల అందాన్ని..

Dark Neck: మెడ నలుపుతో ఇబ్బందిగా ఉందా.. ఈ బెస్ట్ చిట్కాలు మీకోసమే!
Dark Neck
Chinni Enni
|

Updated on: Mar 18, 2024 | 7:16 PM

Share

చాలా మంది లేడీస్.. ముఖానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మెడకు ఇవ్వరు. దీంతో ముఖం మెరిసిపోయినా.. మెడ మాత్రం నల్లగా ఉంటుంది. దీని వల్ల మీరు ఎంతలా రెడీ అయినా. అందంగా కనిపించరు. ముఖం, మెడ ఒకేలా ఉండాలంటే.. రెండింటికీ ఒకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు రాసుకునే క్రీములు.. మెడకు కూడా రాసుకోవాలి. అయితే మెడ నలుపు కలర్ మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. హార్మోన్ల మార్పుల వల్ల, బరువు, ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మెడ భాగం నల్లగా మారుతుంది. కానీ ఇది ఆడవాళ్ల అందాన్ని పాడు చేస్తుంది. మరి ఈ మెడ నలుపును పోగొట్టుకోవాలంటే ఈ చిట్కాలు మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి.

కొబ్బరి నూనె రాయండి:

కొబ్బరి నూనెతో మెడ నలుపును తగ్గించుకోవచ్చు. చాలా మంది కొబ్బరి నూనె వాడటం వల్ల నలుపు అవుతారు అనుకుంటారు. కానీ కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి.. మెడ భాగంలో అప్లూ చేసి.. చేతి వేళ్లతో సున్నితంగా మర్దనా చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే.. మెడ నలుపు రంగు తగ్గుతుంది.

పెరుగు – చింతపండు:

పెరుగు, చింత పండుతో కూడా మెడ నలుపును తగ్గించుకోవచ్చు. చింత పండును వేడి నీటిలో ముందుగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గుజ్జు తీసి.. ఒక టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని మెడ నలుపు భాగంలో రాసి.. మెల్లగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మెడ నలుపు క్రమంగా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

కలబంద – పంచదార:

కలబంద కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కలబంద గుజ్జులో పాలు, పంచదార కలిపి నలుపు ఉన్న ప్రదేశంలో స్క్రబ్ చేయండి. ఇది ఆరినతర్వాత నీటితో కడిగేసుకోవాలి.

నిమ్మకాయ – కొబ్బరి నూనె:

అలాగే ఈ చిట్కా కూడా మెడ నలుపును తగ్గించడంలో బాగా సహాయ పడుతుంది. కొద్దిగా కొబ్బరి నూనెలో నిమ్మ రసం చుక్కలు, కొద్దిగా బేకింగ్ సోడాను వేసి లైట్‌గా స్క్రబ్ చేయాలి. ఇలా తరచూ చేస్తే మెడ నలుపు తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి