Relationship Tips: మీ భాగస్వామికి ఎన్నటికీ చెప్పకూడని విషయాలివే.. చెప్తే వైవాహిక జీవితంలో కష్టాలు ఖాయాం..!

|

Mar 28, 2023 | 1:38 PM

పెళ్లైన ఆరునెలలకే విడాకుల కోసం కోర్టు తలుపులు తడుతున్న జంటలు నానాటికి పెరిగిపోతున్నాయి. అయితే ఇందుకు భార్యభర్తల మధ్య సామరస్యం, ప్రేమాభిమానాలు, బంధం లేకపోవడమే కారణమని

Relationship Tips: మీ భాగస్వామికి ఎన్నటికీ చెప్పకూడని విషయాలివే.. చెప్తే వైవాహిక జీవితంలో కష్టాలు ఖాయాం..!
Relationship Tips
Follow us on

ప్రస్తుత కాలంలో వివాహానికి అర్థాలు మారిపోతున్నాయి. పెళ్లైన ఆరునెలలకే విడాకుల కోసం కోర్టు తలుపులు తడుతున్న జంటలు నానాటికి పెరిగిపోతున్నాయి. అయితే ఇందుకు భార్యభర్తల మధ్య సామరస్యం, ప్రేమాభిమానాలు, బంధం లేకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇంకా వివాహ బంధం కలకాలం ఉండాలంటే భార్యాభర్తల మధ్య నమ్మకం, ప్రేమ చాలా ముఖ్యం. భార్య పక్కన స్నేహితుడిలా నిజాయితీతో ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ చాలా సందర్భాలలో భార్యాభర్తలు స్నేహితులుగా ఉండలేరు. ఆయా సందర్భాలలో సమాజ పరిస్థితులకు కట్టుబడి ఉంటారు. మీరు భర్త లేదా భార్యగా మారిన తర్వాత కావాలనుకున్నా మీరు కొన్ని విషయాలను అర్థం చేసుకోలేరు. అప్పుడు మీ వివాహ జీవితం, సంబంధం దెబ్బతింటుంది. అందువల్ల మీరు ఎన్నటికీ కొన్నిరకాల విషయాలను మీ భాగస్వామికి చెప్పకూడదు. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..

వివాహానికి ముందు మీ గతం గురించి మీ భాగస్వామికి ఎప్పుడూ చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నది మీ భవిష్యత్‌ మాత్రమే, గతం కాదు. అందువల్ల దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ప్రతిరోజూ మీ వివాహ బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. భార్యాభర్తల మధ్య నమ్మకం, నిజాయితీ ఉండటం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. వివాహానికి ముందు మీరు మీ భాగస్వామికి మీ గతం గురించి చెప్పినట్లయితే పెళ్లి చేసుకున్న తర్వాత దానిని ఎప్పుడూ ప్రస్తావించవద్దు.

ముఖ్యంగా పెళ్లి తర్వాత అమ్మాయి జీవితంలో అనేక సవాళ్లు ఉంటాయి. ఆమె వేరే ఇంటికి వెళ్లి స్థిరపడాలి. ఇంకా తన అత్తమామలను సరిగ్గా చూసుకోవాలి. తన భర్త ఎదుట అతడి తల్లిదండ్రులతో చెడుగా ప్రవర్తించకూడదు. మీకు ఇష్టం లేకపోయినా మీ భాగస్వామి ముందు మీ భావాలను వ్యక్తపరచవద్దు. వారు మీ భర్త తల్లిదండ్రులు అని గుర్తుంచుకోండి. వారికి చెడు చేసినట్లయితే మీ భర్త తట్టుకోలేడని గుర్తించండి.

ఇవి కూడా చదవండి

మీరు మీ మాజీతో టచ్‌లో ఉంటే ఈ విషయాన్ని మీ భాగస్వామితో ఎప్పుడూ మాట్లాడవద్దు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమె లేదా అతడు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఇంకా మీ గురించి తప్పుగా అంచనా వేస్తారు. మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు మీ మాజీతో ఎలాంటి సంబంధాన్ని కొనసాగించకపోవడమే మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..